Latest Updates
-
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
చలికాలంలో నువ్వులు తింటే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా వెజిటబుల్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా, రుచిగా తయారు చేసుకోండిలా -
బంపర్ ఆఫర్ అంటే ఇదే.. రీఛార్జ్ తో పాటు ఫ్రీగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ ఇస్తున్న BSNL -
చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే! -
మధ్యాహ్న భోజనానికి బెస్ట్.. వంకాయ మునగకాయ మసాలా 10 నిమిషాల్లోనే చేయండిలా..
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా..
పండగలు, శుభకార్యాల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో సంప్రదాయబద్ధంగా వడ్డించే విందు భోజనాన్ని ధామ్ అంటారు. అందులో వడ్డించే ప్రత్యేక వంటకాల్లో మటర్ పనీర్ ఒకటి. సాధారణ మటర్ పనీర్ తో పోలిస్తే దీని రుచి పూర్తిగా భిన్నంగా, ఎంతో సువాసనభరితంగా ఉంటుంది.
ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండా అప్పటికప్పుడు వేయించిన సుగంధ ద్రవ్యాలు, ఆవనూనె, పెరుగుతో చేసే ఈ కర్రీ శాకాహారులకు నిజమైన విందులా ఉంటుంది. పనీర్ మృదుత్వం, బఠానీల తియ్యదనం, తాజా మసాలాల ఘాటు కలగలిసి అద్భుతమైన రుచిని అందిస్తాయి. హిమాచలీ స్టైల్ మటర్ పనీర్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు: 200 గ్రాములు
పచ్చి బఠానీలు: 1 కప్పు
ఆవనూనె: 3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
టమాటా ప్యూరీ: 2 టమాటాలది
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
సోంపు: 1 టేబుల్ స్పూన్
లవంగాలు: 2 లేదా 3
మెంతులు: అర టీస్పూన్
ఆకుపచ్చ యాలకులు: 2
నల్ల యాలకు: 1
దాల్చిన చెక్క: 1 ఇంచు ముక్క
జీలకర్ర: 1 టీస్పూన్
నల్ల మిరియాలు: 1 టీస్పూన్
కశ్మీరీ ఎర్ర కారం పొడి: 2 టీస్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: తగినంత
బాగా గిలక్కొట్టిన పెరుగు: అర కప్పు
బియ్యప్పిండి: 1 టీస్పూన్
నీరు: పావు కప్పు
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి
తయారీ విధానం
-ముందుగా కడాయిలో ధనియాలు, సోంపు, లవంగాలు, మెంతులు, రెండు రకాల యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు వేసి నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఒక గిన్నెలో ఈ మసాలా పొడిని తీసుకొని, అందులో కాశ్మీరీ కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆవనూనె వేడి చేయాలి. నూనె పచ్చి వాసన పోయేలా బాగా కాగిన తర్వాత బిర్యానీ ఆకు, టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి, కమ్మని సువాసన వచ్చి మసాలా నుంచి నూనె విడిపోయే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో పచ్చి బఠానీలు వేసి కలిపి, కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత పనీర్ ముక్కలు వేసి అవి విరిగిపోకుండా సున్నితంగా కలుపుకోవాలి.
-మరో గిన్నెలో పెరుగు, బియ్యప్పిండి, నీరు వేసి ఉండలు లేకుండా నునుపుగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని కూరలో నెమ్మదిగా పోస్తూ, పెరుగు విరగకుండా ఆపకుండా కలుపుతూ ఉండాలి. బియ్యప్పిండి వేయడం వల్ల గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది.
-చివరగా గ్రేవీ చిక్కబడి, మసాలాలన్నీ చక్కగా కలిసే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి.
-అంతే ఎంతో ఘుమఘుమలాడే సంప్రదాయ మటర్ పనీర్ రెసిపి.
-దీనిని వేడివేడి అన్నంతో వడ్డిస్తే ప్రతి ముద్దలోనూ సుగంధ ద్రవ్యాల గుమగుమలు మిమ్మల్ని మైమరపిస్తాయి. ఇంట్లో వారంతా లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
