Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
రుచికరమైన ఎగ్ 65..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
కోడిగుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఒక గుడ్డు తిన్నా చాలు అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ప్రభుత్వాలు కూడా రోజు ఒక కోడిగుడ్డుని పిల్లలకు పెట్టాలని వివిధ రూపాల్లో సూచిస్తున్నాయి. కండరాలు, కణజాలాన్ని సరిచేయడంలో సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కోడిగుడ్డు కలిగి ఉంటుంది. గుడ్లు రోగనిరోధక వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి..ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఆరోగ్యానికి సహాపడయే అనేక రకల పోషకాలను కోడిగుడ్డు కలిగి ఉంటుంది. కోడిగుడ్డులో ప్రొటీన్ రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్,సెలీనియం,మెగ్నీషియం,విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి6, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆశక్తికరమైన విషయం ఏంటంటే ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా కేవలం కోడిగుడ్లు మాత్రమే తిని జీవిస్తున్నాడు. అతడు మిగతావారికన్నా చాలా ఆరోగ్యంగా కూడా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రోటీన్ యొక్క మంచి మూలం అయిన గుడ్డు తక్కువ ధరలోనే లభిస్తుండటంతో సమాన్యులకు కూడా దీనిని కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఉండదు.కోడిగుడ్డుతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ 65 కూడా ఒకటి.

దక్షిణ భారత ఆహార ప్రియులకు ఇష్టమైన ఫుడ్ లో ఎగ్ 65 కూడా ఒకటి. తమిళనాడులో మొదట ఈ ఎగ్ 65 తయారీ ప్రారంభమైనప్పటికీ క్రమంగా మిగతా ప్రాంతాల్లో కూడా స్ట్రీట్ ఫుడ్ లలో ఎక్కువగా వినియోగించే ఆహారంగా మారిపోయింది.మన తెలుగు ప్రజలు అయితే ఎగ్ 65 అంటే లొట్టలేసుకొని తింటారు. అయితే ఎంతో రుచికరమైన ఎగ్ 65ని మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ 65 తయారీకి కావాల్సినవి
గుడ్లు- మీ అవసరానికి తగినన్ని
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి - 4 టేబుల్ స్పూన్లు
కారం పొడి - 4 టేబుల్ స్పూన్లు
గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నూనె - కావలసినంత
ఉప్పు - తగినంత
ఎగ్ 65 తయారీ విధానం
ముందుగా గుడ్లను నీటిలో సరిగ్గా ఉడకబెట్టాలి.తర్వాత గుడ్డు పెంకును తొలగించండి. తర్వాత ఒక గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేయాలి. తర్వాత అందులో నీరు కలపండి. క్రమంగా దాని పరిమాణాన్ని పెంచండి.. తద్వారా మీరు పేస్ట్ చేయడానికి బాగా కలపవచ్చు. ఇప్పుడు ఉడికించిన గుడ్డును చిన్న ముక్కలుగా తరిగి పిండిలో కలపండి. ఇప్పుడు పిండిని వేసి బాగా కదిలించండి.. తద్వారా మసాలాలు ప్రతి వైపు సమానంగా ఉంటాయి. ఇప్పుడు పేస్ట్ పూతతో గుడ్లు సిద్ధం చేసిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. మీడియం మంట మీద మూడు నిమిషాలు వేయించాలి. గుడ్డు 65 బాగా వేగిన తర్వాత నూనెలోంచి తీసి ప్లేట్‌లోకి మార్చుకుని గ్రీన్ చట్నీతో తింటే ఆ రుచికి ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
