Latest Updates
-
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ..
వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోశలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చట్నీ. కానీ, రోజూ అవే కొబ్బరి చట్నీ, టమాటా పచ్చడి తిని బోర్ కొట్టేసిందా? పదే పదే ఒకే రకమైన చట్నీలు చేసి మీకు విసుగొచ్చిందా? అయితే కాస్త వెరైటీగా, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీని ట్రై చేయాల్సిందే.
హోటల్స్ లో మాత్రమే దొరికే ఆ ప్రత్యేకమైన రుచిని, ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఈ చట్నీని ఒక్కసారి రుచి చూశారంటే, మళ్లీ మళ్లీ మీరే చేసుకుంటారు. నోరూరించే ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) - పావు కిలో
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
ఎండు మిరపకాయలు - 12
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు - 2 రెమ్మలు
టమాటా - 1
చింతపండు - చిన్న నిమ్మకాయంత
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
వంటనూనె - 3 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం:
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 1 రెమ్మ
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించండి. అవి కాస్త వేగాక, పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఎర్రగా వేయించుకోండి.
-ఉల్లిపాయలు రంగు మారుతున్న సమయంలో కరివేపాకు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత అందులో చింతపండు, కాశ్మీరీ కారం పొడిని వేసి బాగా కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు వేయించండి. చివరగా తాజా కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. రుబ్బుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు చట్నీకి అదనపు రుచినిచ్చే తాలింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టి, నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి చట్నీలో కలపండి.
-అంతే.. గుమగుమలాడే హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి ఇడ్లీ, క్రిస్పీ దోశ లేదా ఊతప్పంతో సర్వ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
