హోటల్ స్టైల్ గట్టి చట్నీ.. ఇలా చేస్తే ఏ టిఫిన్ అయినా నాలుగు ఎక్స్ ట్రా లాగించేస్తారు!

Posted By:

దక్షిణ భారతీయ అల్పాహారంలో గట్టి చట్నీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే వడలు, బోండాలు లేదా మసాలా దోసెల పక్కన వడ్డించే ఆ తెల్లటి, చిక్కటి కొబ్బరి చట్నీ రుచి మాటల్లో వర్ణించలేము. చాలా మందికి హోటల్స్ లేదా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో ఇచ్చే చట్నీ అంటే మహా ఇష్టం. ఇంట్లో ఎంత ప్రయత్నించినా ఆ రుచి, ఆ చిక్కదనం రావడం లేదని బాధపడుతుంటారు.

నిజానికి హోటల్ స్టైల్ గట్టి చట్నీలో పెద్ద రహస్యమేమీ లేదు. సరైన పదార్థాలను, సరైన మోతాదులో వాడటం,నీటిని తక్కువగా ఉపయోగించడమే దీనికున్న ఏకైక టెక్నిక్. హోటల్ స్టైల్ టేస్ట్ తో గట్టి చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

How to Make Hotel Style Gatti Chutney at Home Perfectly Recipe in Telugu

కావలసిన పదార్థాలు
-పచ్చి కొబ్బరి
-పల్లీలు(వేరు శెనగపప్పు)
-పుట్నాల పప్పు (శనగపప్పు)
-పచ్చిమిర్చి
-ఉప్పు
-నూనె
-ఆవాలు
-మినపప్పు
-ఎండుమిర్చి
-కరివేపాకు
-పచ్చి శెనగప్పు

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి.

-వేడెక్కిన నూనెలో 1 మీడియం సైజు కప్పు పొట్టు తీసిన వేరుశెనగపప్పు వేసి కమ్మటి వాసన వచ్చి, రంగు మారేవరకు తక్కువ మంట మీద వేయించాలి.

-వేరుశెనగపప్పు సగం వరకు వేగగానే అందులో 10 పచ్చిమిరపకాయలు(సగం కట్ చేసి) వేసి వేయించాలి.

-పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోనే 1 గిన్నెడు పుట్నాల పప్పు(శెనగపప్పు)వేసి ఒక నిమిషం కలుపుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. పాన్ ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వత వేయించిన మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోండి,ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్న మిక్సీ గిన్నెలోనే కావాల్సిన కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేశాక ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చి శెనగపప్పు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆపేయాలి.

-వేగిన తాలింపుని రెడీ చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే హోటల్ స్టైల్ గట్టి చట్నీ రెడీ.

-ఈ చట్నీలో పచ్చి కొబ్బరి ఉండటం వల్ల ఎక్కువ సేపు నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెడితే ఒక రోజు వరకు వాడుకోవచ్చు. కానీ ఫ్రెష్ ‌గా తింటేనే దాని అసలైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

[ of 5 - Users]
Story first published: Monday, December 8, 2025, 13:28 [IST]
Desktop Bottom Promotion