Latest Updates
-
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా
రోజంతా పనులతో అలసిపోయి ఇంటికి రాగానే వంట చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుందా? లేదా ఎప్పుడూ తినే కూరలు కాకుండా ఏదైనా కొత్తగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తుందా? ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉందా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన వంటకం గార్లిక్ పెప్పర్ రైస్ (వెల్లుల్లి మిరియాల అన్నం).
10 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వెల్లుల్లి ఘుమఘుమలు, మిరియాల ఘాటుతో మీ రసనను ఉర్రూతలూగిస్తుంది. వాన పడుతున్నప్పుడు లేదా చలికాలంలో వేడివేడిగా దీన్ని తింటే ఆ కిక్కే వేరు. లంచ్ బాక్సులకు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపి. వెల్లుల్లి మిరియాల అన్నం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించిన అన్నం - 2 కప్పులు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10
ఎండు మిరపకాయలు - 4
ఉల్లిపాయ - 1
కరివేపాకులు - రెండు రెమ్మలు
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
-ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారుతున్న సమయంలో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి పచ్చివాసన పోయి, చక్కటి సువాసన వచ్చే వరకు సన్నని మంట మీద వేయించండి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, వేయించిన ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లా అస్సలు చేయకూడదు. వెల్లుల్లి, మిరియాల పలుకులు అక్కడక్కడా తగులుతూ ఉంటేనే అన్నం తినేటప్పుడు అద్భుతమైన రుచి వస్తుంది.
-అదే పాన్ మళ్లీ స్టవ్ మీద పెట్టి, బరకగా రుబ్బుకున్న వెల్లుల్లి-మిరియాల మిశ్రమాన్ని వేసి మరో నిమిషం పాటు సన్నని మంట మీద వేయించండి.
-ఇప్పుడు ముందుగా ఉడికించి, చల్లార్చి పెట్టుకున్న పొడిపొడి అన్నాన్ని పాన్ లో వేయండి. మసాలా అంతా అన్నం మెతుకులకు బాగా పట్టేలా నిదానంగా కలపండి. గరిటెతో అన్నం విరిగిపోకుండా పైకి కిందికి కలుపుకోవాలి.
-అన్నం మసాలాతో పూర్తిగా కలిసిన తర్వాత, మరో రెండు నిమిషాల పాటు మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వండి.
-అంతే ఎంతో రుచికరమైన గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
