Latest Updates
-
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్! -
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే! -
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా.. -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి -
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా..
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా
రోజంతా పనులతో అలసిపోయి ఇంటికి రాగానే వంట చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుందా? లేదా ఎప్పుడూ తినే కూరలు కాకుండా ఏదైనా కొత్తగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తుందా? ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉందా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన వంటకం గార్లిక్ పెప్పర్ రైస్ (వెల్లుల్లి మిరియాల అన్నం).
10 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వెల్లుల్లి ఘుమఘుమలు, మిరియాల ఘాటుతో మీ రసనను ఉర్రూతలూగిస్తుంది. వాన పడుతున్నప్పుడు లేదా చలికాలంలో వేడివేడిగా దీన్ని తింటే ఆ కిక్కే వేరు. లంచ్ బాక్సులకు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపి. వెల్లుల్లి మిరియాల అన్నం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించిన అన్నం - 2 కప్పులు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10
ఎండు మిరపకాయలు - 4
ఉల్లిపాయ - 1
కరివేపాకులు - రెండు రెమ్మలు
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
-ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారుతున్న సమయంలో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి పచ్చివాసన పోయి, చక్కటి సువాసన వచ్చే వరకు సన్నని మంట మీద వేయించండి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, వేయించిన ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లా అస్సలు చేయకూడదు. వెల్లుల్లి, మిరియాల పలుకులు అక్కడక్కడా తగులుతూ ఉంటేనే అన్నం తినేటప్పుడు అద్భుతమైన రుచి వస్తుంది.
-అదే పాన్ మళ్లీ స్టవ్ మీద పెట్టి, బరకగా రుబ్బుకున్న వెల్లుల్లి-మిరియాల మిశ్రమాన్ని వేసి మరో నిమిషం పాటు సన్నని మంట మీద వేయించండి.
-ఇప్పుడు ముందుగా ఉడికించి, చల్లార్చి పెట్టుకున్న పొడిపొడి అన్నాన్ని పాన్ లో వేయండి. మసాలా అంతా అన్నం మెతుకులకు బాగా పట్టేలా నిదానంగా కలపండి. గరిటెతో అన్నం విరిగిపోకుండా పైకి కిందికి కలుపుకోవాలి.
-అన్నం మసాలాతో పూర్తిగా కలిసిన తర్వాత, మరో రెండు నిమిషాల పాటు మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వండి.
-అంతే ఎంతో రుచికరమైన గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
