రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

చికెన్ తో ఏది వండినా అద్భుతంగానే ఉంటుంది. చికెన్ తో బోలెడు వెరైటీలు ఉన్నా బార్యానీ వంటకం మాత్రం రుచి మాత్రం నెక్ట్ప్ లెవల్. చికెన్ బార్యానీ ఎప్పుడు తిన్నా బోర్ కోట్టదు ఎవ్వరికైనా. అయితే చికెన్ బిర్యానీకి బదులు ఈసారి చికెన్ 65 బిర్యానీ ట్రై చేసి చూడండి. మీ నాలుక దీని టేస్ట్ జీవితంతం గుర్తుంచుకుంటుంది.

అంతేకాకుండా ఏదో పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినట్లుగా అనిపిస్తుంది. అంటే దానీ టేస్ట్ చూశాక ఇంట్లో ఇంత బాగా కుదరిందా అని ఆశ్చర్యపోతారు.సూపర్ టేస్టీ చికెన్ 65 బిర్యానీ మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

How to Make Restaurant Style Chicken 65 Biryani at Home Easy Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

చికెన్ 65 కోసం:
-800 గ్రాముల బోన్ లెస్ చికెన్
-3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు
-1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
-2 టేబుల్ స్పూన్ల కశ్మీరీ కారం
-1 టీస్పూన్ ఎర్ర కారం పొడి
-1 టీస్పూన్ జీలకర్ర పొడి
-1 టీస్పూన్ ధనియాల పొడి
-1 టీస్పూన్ మిరియాల పొడి
-2 టీస్పూన్ల పసుపు
-అర టీస్పూన్ గరం మసాలా
-5 కరివేపాకు ఆకులు
-2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
-6 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి
-1 కోడిగుడ్డు
-చిటికెడు ఎర్ర ఫుడ్ కలర్

బిర్యానీ కోసం:
-3 పెద్ద ఉల్లిపాయలు
-1 కప్పు ఆయిల్
-8 కరివేపాకు ఆకులు
-3 పెద్ద టమాటోలు
-1 టేబుల్ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్
-బిర్యానీ మసాలా
-1 టేబుల్ స్పూన్ కశ్మీరీ కారం
-ఉప్పు
-పచ్చి మిరపకాయలు
-3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు
-ఎండిన రేగు(ఎండిన ఆలూ బుఖారా)
-పుదీనా
-నిమ్మరసం
-ఫుడ్ కలర్

రైస్ కోసం:
-3 కప్పుల రైస్
-జీలకర్ర
-లవంగాలు
-స్టార్ అనాస
-బిర్యానీ ఆకు
-ఉప్పు
-వెనిగర్

దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేయండి. ఇందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కశ్మీరీ కారం, ఎర్ర కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి వేయండి. చివరగా ఇందులో 1 కోడిగుడ్డు పగుటకొట్టి వేయండి. మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి గిన్నె మీద మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోండి.

-అరగంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడయ్యాక అందులో కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి క్రిస్పీగా అయ్యేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయల పొడవాటి చీలికలు వేసి గోల్డెన్ కలర్ లోకి మారేదాకా వేయించాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయలను మాత్రమే చివర్లో లేయరింగ్ కోసం తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ లో ఉన్న మిగతా ఉల్లిపాయల్లో కరివేపాకు, టమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా, కశ్మీరీ ఎర్ర కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ చీలికలు వేసి టమాటో ముక్కలు మెత్తబడేదాకా వేయించాలి. తర్వాత ఇందులో పెరుగు వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి.

-తర్వాత ఇందులో 1/3 కప్పు నీళ్లు పోసి కలిపాక అందులో వేయించినవాటిలో సగం చికెన్ ముక్కలను వేయండి

-ఈలోగా మరోవైపు, స్టవ్ మీద గిన్నెలో బియ్యం ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి అందులో బిర్యానీ ఆకు, ఇతర మసాలా దినుసులు, ఉప్పు, వెనిగర్ వేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి 75 శాతం వరకు బియ్యం ఉడికించి స్టవ్ ఆపేయండి.

-తర్వాత చికెన్ గ్రేవీ ఉన్న బాండీలో ఎండు ఆల్ బుఖారా, పుదీనా, నిమ్మరపం పిండుకోండి,పచ్చిమిరపకాయలు, చిటికెడు ఫుడ్ కలర్, దీనిమీద 75శాతం ఉడికించిన అన్నం వేసి దానీ మీద మిగిలిన చికెన్ 65 ముక్కలు, పుదీనా వేసి మూతపెట్టి 20 నిమిషాలు తక్కువ మంట మీద దమ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆపేయండి.

-అంతే చికెన్ 65 బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, October 25, 2026, 15:28 [IST]
Desktop Bottom Promotion