Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
రోజూ తినే రొటీన్ టొమాటో, పల్లీ పచ్చళ్లు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఎంతో రుచిగా ఉండే కాప్సికమ్ పెరుగు పచ్చడి ట్రై చేయండి. ఇది కేవలం సాధారణ పచ్చడి మాత్రమే కాదు.. ఎన్నో రకాలుగా వాడుకోగలిగే ఒక అద్భుతమైన, బహుముఖ రెసిపీ. వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు ఇలాంటి పచ్చళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
కాప్సికమ్ ను మంటపై కాల్చడం వల్ల వచ్చే స్మోకీ ఫ్లేవర్, పెరుగు ఇచ్చే క్రీమీ టెక్స్చర్ ఈ చట్నీ రుచిని రెట్టింపు చేస్తాయి. ఈ చట్నీని బ్రెడ్ శాండ్ విచ్ స్ప్రెడ్ గా వాడుకోవచ్చు, వేడివేడి రోటీ లేదా పరాటాతో తినొచ్చు. స్నాక్స్ లో డిప్‌గా లేదా సలాడ్స్ లో డ్రెస్సింగ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంతటి రుచికరమైన కాప్సికమ్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కాప్సికమ్ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
కాప్సికమ్- 1 లేదా 2
వంట నూనె - కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 4 లేదా 5
పచ్చిమిర్చి - మీ కారానికి తగినట్లుగా
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - ఒక చిన్న గుప్పెడు
కమ్మటి పెరుగు- అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - ఐదారు
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
కాప్సికమ్ పెరుగు పచ్చడి తయారీ విధానం
-ముందుగా కాప్సికమ్ ను తీసుకుని, నేరుగా స్టవ్ మంటపై ఉంచి కాల్చాలి. దాని పైన ఉండే చర్మం నల్లగా మారి, పొరలా వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడికి అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బాగా కాలిన తర్వాత దానిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక పైన ఉన్న నల్లటి పొట్టును తీసేసి, కాప్సికమ్ ను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని, కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు, మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత, అందులో పల్లీలు వేసి అన్నీ కలిసేలా మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. చివరగా గుప్పెడు కొత్తిమీర వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. కొత్తిమీర వేడికి కొద్దిగా మగ్గగానే స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించుకున్న మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఈ ఉల్లిపాయ-పల్లీల మిశ్రమం, ముందుగా కట్ చేసుకున్న కాల్చిన కాప్సికమ్ ముక్కలు, కమ్మటి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని మిరియాలు వేసుకోవాలి.
-ఇప్పుడు వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లా, క్రీమీగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి.
-అంతే కాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
