Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లోనే సులభంగా జీడిపప్పు పెరుగు తయారీ..రుచి చూస్తే వదిలిపెట్టరు!
మీరు ఎప్పుడైనా జీడిపప్పు పెరుగు గురించి విన్నారా? లేదా రుచి చూశారా? వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. మారుతున్న కాలంతో పాటు పశువుల పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటూ కేవలం మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే వీగన్ డైట్ ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాకుండా ఆవు లేదా గేదె పాలు తాగినప్పుడు కొందరికి కడుపులో ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది..అలాంటి వారికి, పేగుల ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రత్యామ్నాయమే ఈ జీడిపప్పు పెరుగు. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ కమ్మని పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

జీడిపప్పు పెరుగు తయారీకి కావలసిన పదార్థాలు
జీడిపప్పు - 1 కప్పు
నిమ్మకాయ - 1 (లేదా 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్)
మేపుల్ సిరప్ లేదా తేనె - 1 టీస్పూన్
ఉప్పు - చిటికెడు
ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ లేదా పెరుగు స్టార్టర్ కల్చర్ (పెరుగు
తోడుకోవడానికి)
జీడిపప్పు పెరుగు తయారీ విధానం
-ముందుగా జీడిపప్పును శుభ్రమైన నీటితో కడిగి, ఆపై తగినన్ని నీళ్లు పోసి సుమారు 2-3 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి బాగా ఉబ్బుతాయి.
-నానిన జీడిపప్పులోని నీటిని వంపేసి, చల్లటి నీటితో మరోసారి కడగాలి. ఇప్పుడు ఆ జీడిపప్పును మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఆ పేస్ట్ లో నిమ్మరసం, ఒక స్పూన్ మేపుల్ సిరప్ లేదా తేనె, చిటికెడు ఉప్పు వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో పెరుగు స్టార్టర్ ను వేసి బాగా కలపాలి.
-తయారైన ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన గాజు సీసాలో పోసి, దానిపై మూతకు బదులుగా ఒక కాటన్ వస్త్రం లేదా పేపర్ టవల్ ఉంచి రబ్బరు బ్యాండ్ వేయాలి. దీనిని ఇంట్లో వెచ్చగా ఉండే ప్రదేశంలో (గాలి తగలకుండా) కనీసం 8 నుండి 10 గంటల పాటు కదపకుండా ఉంచాలి. ఎక్కువ సమయం ఉంచితే పెరుగు మరింత పుల్లగా మారుతుంది.
-8 గంటల తర్వాత పెరుగు గట్టిపడిందో లేదో చూడాలి. బాగా తోడుకున్న తర్వాత ఆ సీసాను తీసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అంతే కమ్మని జీడిపప్పు పెరుగు రెడీ.ఈ స్వచ్ఛమైన పెరుగును మీరు నేరుగా తినొచ్చు. లేదా ఇందులో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, కాస్త తేనె కలుపుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
