Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్!
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
చాలామందికి అన్నంతో నంజుకోడానికి ఆమ్లెట్ తినే అలవాటు ఉంటుంది. అయితే చాలామంది ఎప్పుడూ ఒకే రకమైన ఆమ్లెట్ ను తింటారు.అయితే ఎప్పుడూ ఒకే రీతిలో చేసే ఆమ్లెట్ తింటే ఎవరికైనా విసుగు రావడం సహజం. కాబట్టి ఈసారి ఆమ్లెట్ తినాలనిపిస్తే ఖచ్చితంగా సీక్రెట్ మసాలాతో చేసే వెల్లుల్లి కారం ఆమ్లెట్ తయారుచేసుకోండి.
కేవలం 10 నిమిషాల్లోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. ఇక దీని రుచి గురించి చెప్పాలంటే..అద్భుతం కన్నా మంచిన ఇంకో పదం ఏదైనా ఉందేమోనని వెతకాల్సిందే. అంత బాగుంటుంది. మీ ఇంట్లోనే స్పెషల్ మసాలాతో వెల్లుల్లి కారం ఆమ్లెట్ ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వెల్లుల్లి కారం ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉప్పు
-కారం
-వెల్లుల్లి
-గరం మసాలా(షాజీరా, నల్ల మిరియాలు, పచ్చ యాలకలు)
-టమాటో
-ఉల్లిపాయ
-ఆయిల్
-గుడ్లు
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!
వెల్లుల్లి కారం ఆమ్లెట్ తయారీ విధానం
-ముందుగా రోట్లో కారం, ఉప్పు,వెల్లుల్లి,షాజీరా, నల్ల మిరియాలు, పచ్చ యాలకలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ,జారుగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో గ్రైండ్ చేసిన టమాటో ఉల్లిపాయ మిశ్రమం వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో ముందుగా నూరుకున్న వెల్లుల్లి కారం మిశ్రమం కూడా వేసి పచ్చివాసన పోయేదాకా తక్కువ మంట మీద కలుపుతూ వేయించాలి.
-తర్వాత ఒక గిన్నెలో నాలుగు గుడ్లు వేసి గిలక్కొట్టుకొని బాండీలోని మసాలా మిశ్రమం పచ్చివాసన పోయిన తర్వాత అందులో నాలుగు గుడ్ల మిశ్రమం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దీని మీదనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు చల్లుకోండి.
-ఆమ్లెట్ ని రెండు వైపులా బాగా కాల్చుకున్నాక స్టవ్ ఆపేయండి.
-అంటే వెల్లుల్లి కారం ఆమ్లెట్ రెడీ. దీనిని ఎలాంటి కూర లేకుండా అన్నంతో కలుపుకొని కూడా తినొచ్చు. దీన్ని నోట్లో పెట్టుకోగానే స్వర్గంలో తేలినట్లు అనిపించడం గ్యారెంటీ. అంతేకుండా సాంబార్, రసం అన్నంలో లేదా పప్పు అన్నంతో కూడా కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
