For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హునసే గొజ్జు రెసిపి । కర్ణాటక వారి చింతపండు కూర । చింత గొజ్జు రెసిపి

హునసె గొజ్జు కర్ణాటకలో ప్రత్యేకంగా పక్కన కూరలాగా వండుతారు. వీడియో, చిత్రాలతో కూడిన ఈ తయారీవిధానం చదివి ప్రయత్నించండి.

Posted By: Deepti
|

హునసె గొజ్జు కర్ణాటకలో ప్రత్యేకంగా పక్కన కూరలాగా వండుతారు. ఈ చింతపండు కూరను చింతపండు రసం, బెల్లం, ప్రత్యేక దినుసులు వాడి వండుతారు.

తియ్యని, పుల్లని, ఘాటైన చింతపండు గొజ్జు రుచికరమైన కూర. ఇది మీకు విందుభోజనంలా ఉంటుంది. దీన్ని పరమాన్నం లేదా వేడి అన్నంతో కలిపి తింటారు. పొంగలితో కలిపి దీన్ని వడ్డిస్తే శుభ్రమైన పళ్ళేలు తిరిగొస్తాయి.

చింతపండు పుల్లదనం, పచ్చిమిర్చి ఘాటుదనం, బెల్లం తియ్యదనం ఈ వంటకాన్ని చాలా రుచికరంగా మార్చి మీ నాలుకకు రుచిని అందిస్తాయి. ఇది సులభంగా అయిపోయి, ఎక్కువ శ్రమ కూడా తీసుకోదు.

దీన్ని ముఖ్య వంటకాలకి పక్కన కూరలాగా ప్రయత్నించండి. వీడియో, చిత్రాలతో కూడిన ఈ తయారీవిధానం చదివి ప్రయత్నించండి.

హునసే గొజ్జు రెసిపి । కర్ణాటక వారి చింతపండు కూర । చింత గొజ్జు రెసిపి । తియ్యని పుల్లని చింతపండు కూర తయారీ
హునసే గొజ్జు రెసిపి । కర్ణాటక వారి చింతపండు కూర । చింత గొజ్జు రెసిపి । తియ్యని పుల్లని చింతపండు కూర తయారీ
Prep Time
20 Mins
Cook Time
50M
Total Time
50 Mins

Recipe By: సుమా జయంత్

Recipe Type: పక్కన కూర

Serves: 4 కి

Ingredients
  • చింతపండు - నిమ్మకాయంత పరిమాణం

    నీరు - 1 ½ కప్పు

    నూనె - 1 ½ చెంచా

    ఆవాలు - 1చెంచా

    జీలకర్ర - 1 చెంచా

    పచ్చిమిర్చి ( తరిగినది) - ¼ కప్పు

    కరివేపాకులు - 10-15

    ఇంగువ - ¼ చెంచా

    బెల్లం - ½ కప్పు

    ఉప్పు రుచికి తగినంత

    తురిమిన కొబ్బరి - ¼ కప్పు

    కొత్తిమీర ( తురిమినది) - 1 ½ చెంచా

How to Prepare
  • 1. గిన్నెలో చింతపండు తీసుకోండి.

    2. అరకప్పు నీరు పోయండి.

    3. చింతపండుని పిండి రసం తీయండి

    4. 15నిమిషాలు నానబెట్టండి.

    5. చేతితో రసాన్ని పిండి పక్కన పెట్టుకోండి.

    6. వేడి పెనంలో నూనెను వేడిచేయండి

    7. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.

    8. జీలకర్రను కూడా వేసి వేయించండి.

    9. తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి.

    10. ఇంగువ, చింతపండురసం కూడా వేయండి.

    11. కప్పుడు నీరు పోసి, బాగా కలపండి.

    12.5 నిమిషాలు ఉడకనివ్వండి.

    13. బెల్లం కూడా వేసి బాగా కలపండి.

    14. అయ్యాక, తరిగిన కొబ్బరి, ఉప్పు వేయండి.

    15.బాగా కలిపి మరో అరగంట ఉడకనివ్వండి.

    16. పైన కొత్తిమీరతో అలంకరించండి.

    17. గిన్నెలోకి తీసుకుని వేడిగా వడ్డించండి.

Instructions
  • 1. చింతపండు బదులు చింతపండు పేస్ట్ ను కరిగించవచ్చు.
  • 2. మీకు చింతపండు నానబెట్టడం ఇష్టం లేకపోతే, వాటిని వేడినీటిలో వేసి పిండవచ్చు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 2 చెంచాలు
  • క్యాలరీలు - 120 క్యాలరీలు
  • కొవ్వు - 1.6 గ్రాములు
  • ప్రొటీన్ - 5.1 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 31 గ్రాములు
  • చక్కెర - 19 గ్రాములు
  • ఫైబర్ - 1 గ్రాము

స్టెప్ బై స్టెప్ - హునసె గొజ్జు (చింత గొజ్జు రెసిపి) తయారీ ఎలా

1. గిన్నెలో చింతపండు తీసుకోండి.

2. అరకప్పు నీరు పోయండి.

3. చింతపండుని పిండి రసం తీయండి.

4. 15నిమిషాలు నానబెట్టండి.

5. చేతితో రసాన్ని పిండి పక్కన పెట్టుకోండి.

6. వేడి పెనంలో నూనెను వేడిచేయండి.

7. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.

8. జీలకర్రను కూడా వేసి వేయించండి.

9. తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి.

10. ఇంగువ, చింతపండురసం కూడా వేయండి.

11. కప్పుడు నీరు పోసి, బాగా కలపండి.

12. 5 నిమిషాలు ఉడకనివ్వండి.

13. బెల్లం కూడా వేసి బాగా కలపండి.

14. అయ్యాక, తరిగిన కొబ్బరి, ఉప్పు వేయండి.

15. బాగా కలిపి మరో అరగంట ఉడకనివ్వండి.

16. పైన కొత్తిమీరతో అలంకరించండి.

17. గిన్నెలోకి తీసుకుని వేడిగా వడ్డించండి.

[ of 5 - Users]
English summary

Hunase Gojju Recipe | Karnataka Style Tamarind Curry | Tamarind Gojju Recipe | Sweet And Sour Tamarind Curry Recipe । కర్ణాటక వారి చింతపండు కూర । చింత గొజ్జు రెసిపి । తియ్యని పుల్లని చింతపండు కూర తయారీ

Hunase gojju is an authentic side dish that is prepared in Karnataka. Watch the video recipe. Here is a step-by-step procedure with images.
Desktop Bottom Promotion