Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు!
ఇంట్లో చపాతీ, నాన్ లేదా రోటీ చేసుకున్నామంటే దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ముందుగా గుర్తొచ్చేది పనీర్ కర్రీ. అయితే ప్రతిసారీ ఒకే రకమైన పనీర్ బటర్ మసాలా లేదా కడాయ్ పనీర్ వండితే ఇంట్లో వాళ్లకు బోర్ కొట్టేస్తుంది.
మీ కుటుంబ సభ్యులకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటే మాత్రం ఈసారి హైదరాబాదీ పనీర్ కీమా మసాలా ట్రై చేయండి. ఇది పూరీ, చపాతీ, పుల్కా, బటర్ నాన్.. ఇలా దేనితో తిన్నా అద్భుతంగా ఉంటుంది.

పనీర్ కీమా మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
మిరియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
బాదం పప్పులు - 6
జీడిపప్పు - 10
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 4
యాలకులు - 2
గసగసాలు - 2 టీస్పూన్లు
కొబ్బరి తురుము- 1 టేబుల్ స్పూన్
తాజా పనీర్ - 400 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
పుదీనా ఆకులు - కొద్దిగా
చిక్కటి కమ్మని పెరుగు - 100 గ్రాములు
గ్రేవీకి నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 1
పెద్ద ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా

పనీర్ కీమా మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో మసాలా దినుసులు (మిరియాల పొడి, జీలకర్ర, బాదం, జీడిపప్పు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, కొబ్బరి తురుము) వేసి దోరగా సువాసన వచ్చే వరకు వేయించండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో తురిమి పెట్టుకున్న పనీర్ వేయండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా, చిక్కటి పెరుగు వేసి బాగా కలపండి. మసాలాలన్నీ పనీర్ కు పట్టేలా కలిపాక, మూత పెట్టి కనీసం 20 నిమిషాల పాటు నాననివ్వండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి.
-ఉల్లిపాయలు వేగాక, తురిమిన టమాటా గుజ్జును వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనివ్వండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పొడిని, సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కూరలోంచి నెయ్యి పైకి తేలే వరకు ఉడికించండి
-గ్రేవీ చిక్కబడి నూనె లేదా నెయ్యి పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. అంతే పనీర్ కీమా మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications