Latest Updates
-
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
పచ్చడి అనగానే మన తెలుగువారికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అందులోనూ మామిడికాయ పచ్చడి అంటే ప్రాణం. అయితే ఎప్పుడూ మన రెగ్యులర్ స్టైల్ లో కాకుండా కాస్త ఘాటుగా, పుల్లపుల్లగా, వెల్లుల్లి, ఆవనూనె సువాసనలతో గుమగుమలాడే బీహారీ స్టైల్ ఇన్ స్టంట్ మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా రుచి చూశారా? ఇది తయారు చేయడం చాలా సులువు. నిమిషాల్లో తయారయ్యే ఈ పచ్చడిని అప్పటికప్పుడు తినేయవచ్చు. కానీ సమయం గడిచేకొద్దీ దీని రుచి మరింత అద్భుతంగా మారుతుంది.

బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - 3 లేదా 4
వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
పచ్చిమిర్చి - 2 లేదా 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
పసుపు - అర టీస్పూన్
కారం - 1 నుంచి ఒకటిన్నర టీస్పూన్ వరకు
పసుపు రంగు ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - ఒక చిటికెడు
వాము - అర టీస్పూన్
కలోంజి (నల్ల జీలకర్ర) - 1 టీస్పూన్
ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్)- 4 టేబుల్ స్పూన్లు
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఒక పొడి వస్త్రంతో తుడిచి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పై తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి. మీకు ఇష్టమైతే రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు కూడా.
-మామిడికాయ తురుమును ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని కాసేపు ఎండలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కానీ మనం ఇన్ స్టంట్ గా చేస్తున్నాం కాబట్టి నేరుగా వాడేయవచ్చు. ఇప్పుడు ఈ తురుములో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను వేసి కలపాలి. ఆ తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి అన్నీ మామిడి తురుముకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పసుపు రంగు ఆవాలు, సోంపు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి సన్నని మంటపై కొన్ని సెకన్ల పాటు దోరగా వేయించాలి. అవి చల్లారాక మిక్సీ పట్టి బరకగా పొడి చేసుకోవాలి. ఈ వేయించిన మసాలా పొడిని మామిడికాయ మిశ్రమంలో వేయాలి. అందులోనే వాము, కలోంజి గింజలు కూడా వేయాలి.
-చివరగా ఆవనూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి మామిడికాయ మిశ్రమంలో పోసి గరిటతో అన్నీ కలిసేలా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. అంతే ఘాటైన బీహారీ పచ్చడి రెడీ. దీనిని ఒక మూత పెట్టి కొన్ని గంటల పాటు లేదా ఒక రోజంతా పక్కన పెడితే, మసాలాలన్నీ మామిడికాయకు పట్టి రుచి అమోఘంగా తయారవుతుంది.
-వేడివేడి అన్నం, పప్పుతో గానీ, రోటీ, పరాఠా లాంటి వాటితో గానీ ఈ పచ్చడిని నంజుకుంటే ఆ రుచే వేరు. వెల్లుల్లి, ఆవనూనె కాంబినేషన్ ఇచ్చే కిక్ భలేగా ఉంటుంది. చేసిన వెంటనే తిన్నా బాగుంటుంది, కానీ మరుసటి రోజుకి దీని రుచి రెట్టింపు అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications