చాక్లెట్ బ్రౌనీ చీజ్‌ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్‌ ప్రైజ్ ఇవ్వండి!

Posted By:

ఇవాళ(నవంబర్ 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మీ జీవితంలో ముఖ్యమైన పురుషులకు అంటే నాన్న, భర్త, సోదరుడు లేదా ప్రియమైన స్నేహితునికి ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు మధురమైన సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ చేతులతో ప్రేమగా చేసిన చాక్లెట్ బ్రౌనీ చీజ్‌కేక్ గిఫ్గ్ గా ఇస్తే ఆ ఆనందమే వేరు.

రెస్టారెంట్‌ స్టైల్‌ లో ఉండే ఈ స్పెషల్ డెజర్ట్‌ ను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. రిచ్ ఫడ్జ్ బ్రౌనీ, క్రీమీ చీజ్‌కేక్ కలయికతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ అద్భుతమైన కేక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

International Men s Day Special Chocolate Brownie Cheesecake Recipe in Telugu

కావలసిన పదార్థాలు

బ్రౌనీ కోసం:

డార్క్ చాక్లెట్- 100 గ్రాములు
మైదా పిండి- అర కప్పు
నెయ్యి లేదా వెన్న- అర కప్పు
కాస్టర్ షుగర్- అర కప్పు,
కోకో పౌడర్- 2 టేబుల్ స్పూన్లు,
గుడ్లు- 2
వెనిలా ఎసెన్స్- 1 టీస్పూన్

చీజ్‌కేక్ కోసం:

క్రీమ్ చీజ్- 200 గ్రాములు
ఫ్రెష్ క్రీమ్- పావు కప్పు
కాస్టర్ షుగర్(పొడి చక్కెర)- 1/3 కప్పు
కార్న్‌ఫ్లోర్- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టీస్పూన్

అలంకరణ కోసం:

చాక్లెట్ చిప్స్- 2 టేబుల్ స్పూన్లు లేదా కరిగించిన చాక్లెట్

చలికాలం స్పెషల్ బ్రేక్‌ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా, మీ ఓవెన్‌ ను 170 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్రీహీట్ చేసి ఉంచండి. కేక్ టిన్ అడుగున అంటుకోకుండా కొద్దిగా నూనె లేదా వెన్న రాసి పక్కన పెట్టండి.

-ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్, నెయ్యి లేదా వెన్న వేసి, డబుల్ బాయిలర్ పద్ధతిలో లేదా మైక్రోవేవ్‌ లో పూర్తిగా కరిగించండి. అందులో కాస్టర్ షుగర్ (పొడి చక్కెర), కోకో పౌడర్ జతచేసి ఉండలు లేకుండా బాగా కలపండి.

-ఇప్పుడు అందులోనే గుడ్లు, వెనిలా ఎసెన్స్‌ ను ఒక్కొక్కటిగా వేస్తూ మృదువుగా కలపండి. తర్వాత జల్లించిన మైదా పిండిని వేసి పిండి గట్టిపడకుండా మెల్లగా ఫోల్డ్ చేయండి.

-సిద్ధమైన ఈ బ్రౌనీ మిశ్రమాన్ని కేక్ టిన్‌ లో పోసి, 170 డిగ్రీల దగ్గర 15 నుండి 18 నిమిషాల పాటు బేక్ చేయండి.

-బ్రౌనీ బేక్ అయ్యేలోపు, మరొక గిన్నెలో క్రీమ్ చీజ్, మిగిలిన కాస్టర్ షుగర్‌ ను క్రీమీగా, నునుపుగా అయ్యేవరకు బాగా బీట్ చేయండి.

-అందులో ఫ్రెష్ క్రీమ్, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి మళ్లీ చిక్కగా, మృదువుగా అయ్యేలా గిలకొట్టండి.

-బేక్ అయిన బ్రౌనీ పొర కొద్దిగా చల్లారిన తర్వాత, దానిపై చీజ్‌ కేక్ మిశ్రమాన్ని సమానంగా పరచండి.

-ఇప్పుడు ఓవెన్ ఉష్ణోగ్రతను 160 డిగ్రీల సెల్సియస్‌ కు తగ్గించి, మరో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేయండి.

-కేక్ మధ్య భాగం కొద్దిగా కదులుతూ ఉన్నా కంగారుపడకండి, చల్లారాక అది గట్టిపడుతుంది.

-కేక్‌ ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత కనీసం 4 నుండి 5 గంటల పాటు ఫ్రిజ్‌ లో ఉంచితే కేక్ పర్ఫెక్ట్‌ గా సెట్ అవుతుంది.

-చివరగా, ఫ్రిజ్ నుండి కేక్‌ ను బయటకు తీసి చాక్లెట్ చిప్స్ లేదా కరిగించిన చాక్లెట్‌ తో అలంకరించండి.

[ of 5 - Users]
Story first published: Thursday, November 19, 2026, 14:09 [IST]
Desktop Bottom Promotion