Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
సాధారణంగా మన ఇళ్లలో టమాటా రసం, మిరియాల రసం, పప్పు రసం తరచుగా చేసుకుంటాం. కానీ ఎప్పుడూ తినే రుచులతో మీకు బోర్ కొట్టిందా? రసంలో కొత్తదనం కోసం వెతుకుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఒకటుంది. అదే అయ్యంగార్ స్టైల్ కొబ్బరి పాల రసం.
అయ్యంగార్ల వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ కొబ్బరి పాల రసం కూడా ఆ కోవకే చెందుతుంది. రోజూ తినే సాంబారు, చింతపండు చారుతో విసిగిపోయిన వారికి, కొబ్బరి పాలు ఇచ్చే కమ్మదనం ఈ రసం ద్వారా ఒక సరికొత్త రుచిని పరిచయం చేస్తుంది. ఈ అద్భుతమైన రసాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
రసం తయారీకి
బాగా పండిన టమాటా - 1
పచ్చిమిర్చి - 2
చింతపండు రసం - 1 కప్పు
కరివేపాకు - కొద్దిగా
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 2 కప్పులు
చిక్కటి కొబ్బరి పాలు - 1 కప్పు
తాజా కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
మసాలా ముద్ద కోసం
మిరియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 8
తాలింపు కోసం
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
ఇంగువ లేదా పసుపు - చిటికెడు
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 1 రెమ్మ
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో తరిగిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మీ చేతులతో బాగా మెత్తగా నలపండి. టమాటాలోని రసం బయటకు వచ్చేలా నలపడం వల్ల రసానికి మంచి రుచి వస్తుంది.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒక కప్పు చింతపండు రసం, అర టీస్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, దానికి 2 కప్పుల నీళ్లు జతచేయండి. స్టవ్ మీద పెట్టి సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించండి.
-రసం మరిగేలోపు, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. పది నిమిషాల పాటు బాగా మరిగిన రసంలో, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి మరో నిమిషం పాటు మరగనివ్వండి.
-ఇప్పుడు స్టవ్ మంటను పూర్తిగా తగ్గించండి. ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలను రసంలో పోసి నెమ్మదిగా కలపండి. కొబ్బరి పాలు పోశాక రసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా మరిగించకూడదు. అలా చేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. జస్ట్ వేడెక్కగానే స్టవ్ ఆపేయాలి.
-తాలింపు కోసం వేరొక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఈ ఘుమఘుమలాడే తాలింపును నేరుగా తీసుకెళ్లి రసంలో కలపండి.
-చివరగా సన్నగా తరిగిన పచ్చటి కొత్తిమీర చల్లితే.. కమ్మని వాసనతో నోరూరించే అయ్యంగార్ శైలి కొబ్బరి పాల రసం రెడీ.వేడి వేడి అన్నంలో ఈ రసం కలుపుకుని తింటే.. ఆ కమ్మదనానికి ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా లాగించేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
