Latest Updates
-
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు!
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
ప్రతి ఇంట్లో తరచుగా ఎదురయ్యే సమస్య... రాత్రి వండిన అన్నం మిగిలిపోవడం. మరుసటి రోజు ఆ చల్లటి అన్నం తినలేక, అలాగని పారేయలేక చాలామంది ఇల్లాళ్లు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇకపై మిగిలిపోయిన అన్నాన్ని చెత్తబుట్టలో వేయకండి. అదే అన్నంతో నోరూరించే, కరకరలాడే రైస్ దోసెను క్షణాల్లో ఎలా తయారు చేసుకోండి.
తక్కువ సమయం, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే దీన్ని సులభంగా చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం వేడివేడి స్నాక్ గా ఇది బాగుంటుంది.

మిగిలిపోయిన అన్నంతో దోసె తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని, కొద్దిగా నీటితో కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు బియ్యప్పిండి, కొద్దిగా పుల్లటి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ, సాధారణ దోసె పిండిలా మెత్తగా, పలుచగా మిక్సీ పట్టుకోవాలి. అన్నం వండేటప్పుడే అందులో ఉప్పు వేసి ఉంటే, ఇప్పుడు పిండిలో కాస్త చూసుకుని తక్కువగా వేసుకోవాలి.
-పిండికి మరింత రుచిని అద్దాలనుకుంటే.. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాస్త జీలకర్ర కలుపుకోవచ్చు. స్పైసీగా ఇష్టపడేవారు కొద్దిగా అల్లం తురుమును కూడా జోడిస్తే రుచి అదిరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పదార్థాలన్నీ చక్కగా నాని, దోసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి.
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..
-పిండి సిద్ధమయ్యాక స్టవ్ మీద దోసెల పెనం పెట్టి వేడి చేయాలి. పెనం మరీ వేడిగా ఉంటే పిండి సరిగ్గా పరుచుకోదు కాబట్టి ముందుగా పెనం వేడెక్కాక మంటను తగ్గించాలి.
-ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకుని పెనంపై పలుచగా మీకు నచ్చిన మందంతో దోసెలా వేసుకోవాలి. చుట్టూ కొద్దిగా నూనె వేసి, రెండు వైపులా మంచి సువాసనతో బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. నూనె తక్కువ తినాలనుకునే డైట్ ఫాలోవర్స్ నాన్ స్టిక్ పాన్ ఉపయోగించడం బెటర్.
-వేడివేడిగా కరకరలాడే ఈ రైస్ దోసెలను పల్లీ చట్నీ, కొబ్బరి పచ్చడి లేదా కమ్మని టమాటా చట్నీతో తింటే ఆ రుచే వేరు. పిల్లల కోసం చేసేటప్పుడు పచ్చిమిర్చిని పూర్తిగా తగ్గించి, కొద్దిగా క్యారెట్ తురుము వేస్తే రంగులమయంగా ఉండి వారు ఎంతో ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
