జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

వీకెండ్ వస్తే చాలు గంటల తరబడి కిచెన్ లో ఉండి రకరకాల వెరైటీ వంటకాలు చేసుకుంటారు చాలామంది. అయితే అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకునే వంటకమే జీడిపప్పు వెల్లుల్లి కారం. రోట్లో వేసి దంచుకుని చేసుకుంటే ఈ పచ్చడి అమృతంలా ఉంటది. జస్ట్ 10 నిమిషాల్లోనే దీనిని చేసుకోవచ్చు.

సాధారణ రోజుల్లో ఆఫీసు లేదా పని నుంచి వచ్చి వంట చేసే ఓపిక లేని టైంలో దీనిని జస్ట్ నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. వేడి అన్నంలో దీనిని కలుపుకోని తింటుంటే ఆహా ఓహో అంటూ లొట్టలేయాల్సిందే. దీనిని క్షణాల్లో చేసుకోవచ్చు కనుక బ్యాచిలర్స్ కూడా ఇది బాగా ఉపయోగపడే రెసిపి. జీడిపప్పు కారం ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

jeedipappu vellulli karam recipe in telugu make cashew garlic roti pachadi at home in just 10 minutes

జీడిపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు

-వెల్లుల్లి
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-కరివేపాకు
-తాలింపు గింజలు
-జీడిపప్పు
-జీలకర్ర
-ధనియాలు
-కారం
-పసుపు
-ఉప్పు
-ఉల్లిపాయ

ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి

జీడిపప్పు కారం తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక పావు కప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి.

-తర్వాత రోట్లో వేయించిన జీడిపప్పు, 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర వేసుకొని కాస్త బరకగానే దంచుకోండి.

-ఇప్పుడు అందులోనే 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, పావు కప్పు కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసుకొని బాగా దంచుకోండి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, కరివేపారు, ఇతర తాలింపు గింజలు వేసి వేయించాలి.

-వేగిన తాలింపుని రోట్లో దంచుకున్న చట్నీ మీద పోసుకొని బాగా కలిసేలా కలుపుకోండి.

-అంతే సూపర్ టేస్టీ, ఈజీ జీడిపప్పు వెల్లుల్లి రోటి పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion