Latest Updates
-
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.!
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
పులిహోర అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంతో సంబంధం లేదు. ఎప్పుడంటే అప్పుడు లొట్టలేసుకుంటూ తినేయడం పక్కా. పులిహోరలో నిమ్మకాయ, చింతపండు, ఆవ, ఉసిరి, మామిడికాయ ఇలా చాలా రకాలు టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా పచ్చి కొబ్బరితో కర్ణాటక స్టైల్ మసాలా పులిహోర చేశారంటే వదిలిపెట్టకుండా తినేస్తారు. కర్ణాటక స్పెషల్ పచ్చి కొబ్బరి మసాలా పులిహోరను ఎలా చేయాలో చూద్దాం..

కర్ణాటక స్పెషల్ మసాలా పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు
పచ్చిమిర్చి- నాలుగు
కొత్తిమీర కాడలు- ఐదు
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
పచ్చి కొబ్బరి- అర కప్పు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి శనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
పల్లీలు- రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
పసుపు- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కరివేపాకు- కొద్దిగా
నిమ్మకాయ- ఒకటి
కొత్తిమీర- కొద్దిగా
కర్ణాటక స్పెషల్ మసాలా పులిహోర తయారీ విధానం
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది!
ముందుగా బియ్యం కడిగి గంటపాటు నానబెట్టుకుని అన్నం వండుకోవాలి. అన్నం వండుకున్న తర్వాత చల్లారనివ్వాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.

తర్వాత పాన్‌లో నూనె వేసుకుని వేడయ్యాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పచ్చికొబ్బరి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
ఇప్పుడు పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి చల్లారిన అన్నం వేసి కలపాలి. చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. హెల్తీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి పులిహోర రెడీ.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా లంచ్‌లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చికొబ్బరితో పులిహోర చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పచ్చికొబ్బరి శరీరంలో చలువ చేస్తుంది. రెగ్యులర్ పులిహోరలకి బదులుగా పచ్చికొబ్బరి పులిహోరను ట్రై చేయండి. వదలకుండా తినేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
