కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్‌ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్!

Posted By:

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనం తీసుకునే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేదిగా ఉండాలి. అలాంటి పోషకాలను అందించే అద్భుతమైన వంటకాల్లో కర్ణాటక ఫేమస్ మెంతి బాత్ ఒకటి. మెంతికూర అనగానే చాలామందికి దానిలో ఉండే చేదు రుచి గుర్తొస్తుంది. ముఖ్యంగా పిల్లలు మెంతికూర తినడానికి కాస్త మారాం చేస్తుంటారు. కానీ కర్ణాటక స్టైల్‌ లో తాజా మసాలా దినుసులు, కొబ్బరి, నెయ్యి జతచేసి చేసే ఈ మెంతి బాత్ రుచికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇది లంచ్ బాక్సులకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Karnataka Style Menthi Bath The Perfect Healthy Lunchbox Recipe in Telugu

మెంతి బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-మెంతి ఆకు
-వంగీ బాత్ మసాలా
-ఉప్పు
-పసుపు
-బియ్యం
-ఆవాలు
-జీలకర్ర
-పల్లీలు
-నూనె
-నెయ్యి
-ఇంగువ
-టమాటో
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చికొబ్బరి తురుము
-ఫ్రొజెన్ బఠాణీ

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే క్యాబేజీ పల్లీ రైస్.. లంచ్ బాక్స్‌ లోకి ఈజీగా.. అమృతం టేస్ట్!

మెంతి బాత్ తయారీ విధానం

-ముందుగా ఒకటిన్నర కప్పుల బియ్యంని అరగంట సేపు నానబెట్టుకోవాలి.

-మెంతికూరను తీసుకుని ఆకులను మాత్రమే తుంచి, రెండు మూడు సార్లు నీటిలో బాగా కడగాలి. తర్వాత ఆకులను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత కుక్కర్ లో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసి ఇందులోనే అర టేబుల్ స్పూన్ ఉప్పు, 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి దీనిని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అన్నం వండుకున్నట్లు వండుకోవాలి.

-అన్నం ఉడికేలోగా మెంతి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరుశెనగపప్పు), 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేపాలి. వేగిన తాలింపులో 2 టమాటోల పెద్ద పెద్ద ముక్కలు, 2 పచ్చిమిరపకాయల చీరిన ముక్కలు వేసి వేయించుకోవాలి.

-టమాటోలు మెత్తబడి, వాటిపై తొక్క సపరేట్ అయ్యేవరకు వేపుకున్నాక ఇందులో 3 కప్పులు సన్నగా తరిగిన మెంతికూర ఆకు, కొన్ని ఫ్రోజెన్ పచ్చి బఠాణీలు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెంతి ఆకులోని పసర పోయి మంచి సువాసన వచ్చేవరకు నిదానంగా వేపుకోవాలి.

-మెంతి ఆకు మెత్తబడి, ఎర్రగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండున్నర టేబుల్ స్పూన్ల వంగీ బాత్ పొడి, అర కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొన్నాక స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక వెడల్పాటి పల్లెంలోకి తీసుకొని ఆరబెట్టుకోండి. అన్నం ఆరుతున్నప్పుడే అందులో మెంతి మిశ్రమాన్ని వేసి అన్నానికి నిదానంగా పట్టించాలి.

-అంతే కర్ణాటక స్పెషల్ మెంతి బాత్ రెడీ.

ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్‌ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్

ఆరోగ్యప్రయోజనాలు

-మెంతికూరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఇతర మినరల్స్ మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం,చలికాలంలో వేడి వేడిగా మెంతి బాత్ తినడం వల్ల శరీరానికి వెచ్చదనంతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

-డయాబెటిస్ ఉన్నవారు మెంతి బాత్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

-మెంతికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థం =శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion