Latest Updates
-
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
90వ దశకంలో బాల్యాన్ని గడిపిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం కొబ్బరి మిఠాయి. అప్పట్లో స్కూల్ బయట, బస్టాండ్ల దగ్గర, చిన్న కిరాణా కొట్లలో కనిపించే ఈ మిఠాయిని చూడగానే నోరూరేది. కొంతమంది అయితే స్కూల్ డేస్ లో పాత పుస్తకాలన్నీ పాత సామాన్లు కొనేవాళ్లకి ఇచ్చి వాళ్లు ఇచ్చే కొబ్బరి మిఠాయిని తీసుకొనేవాళ్లు. ఒక రూపాయికి లేదా యాభై పైసలకు దొరికే ఈ కొబ్బరి మిఠాయి రుచికి మరే ఇతర చాక్లెట్ కూడా సాటి రాదు. ఇప్పుడు ఆ అద్భుతమైన రుచిని, మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకుంటూ, ఇంట్లోనే ఈ 90స్ కిడ్స్ స్పెషల్ కొబ్బరి మిఠాయిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కొబ్బరి మిఠాయి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పుట్నాలపప్పు(శెనగపప్పు)
-పచ్చి కొబ్బరి
-చక్కెర
కొబ్బరి మిఠాయి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో పావు కప్పు తినే శెనగపప్పు వేసి జస్ట్ వేడి తగిలేవరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో ఒక కప్పు చక్కెర వేసి,ఇందులో పావు కప్పు నీళ్లు పోసి చక్కెర అంతా కరిగిపోయి పాకం లైట్ గా కలర్ మారుతుంది..అప్పుడు ఒక చిన్నె గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఈ పాకం ఒక చుక్క వేయండి. అది పట్టుకుంటే ఉండలా దగ్గరకి అయిపోవాలి. ఉండ మెత్తగా ఉండాలి..మరీ గట్టిగా అయిపోకూడదు.
-ఇప్పుడు ఆ చక్కెర పాకంలోనే ఫ్రై చేసుకున్న శనగపప్పు, కొబ్బరి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి రాసుకొని అందులో పాన్ లోని మిశ్రమం మొత్తం వేయండి. దాన్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. , ప్లేట్ అంతటా సమానమైన మందంతో చదునుగా సర్దాలి.
-మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పదునైన చాకుతో మీకు నచ్చిన ఆకారంలో చతురస్రం లేదా డైమండ్ షేప్ గాట్లు పెట్టుకోవాలి. మీకు నచ్చిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత, ముక్కలను విడదీసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
-అంతే అంతే నోట్లో వేసుకోగానే కరిగిపోయే మన 90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
