Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.!
పప్పు ధాన్యాల్లో అలసందలకి సాటి మరోటి ఉండదు. ఇందులోని హై ప్రొటీన్ కండరాల నిర్మాణానికి దోహదపడుతుంది. రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. మన పూర్వీకులు వీటిని తరచూ తీసుకోవడం ద్వారానే ఇప్పటికీ అంత బలంగా ఉండేవారు. ఇక అలసందల వడల రుచికి మరోటి సాటి లేదు. కానీ వీటితో కూర చేసుకోవడం చాలా అరుదు. తోటకూరలో వీటిని జత చేసి చేశారంటే ఆ రుచికి మీరు ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. తోటకూర అలసందల కూర ఎలా తయారుచేయాలో చూద్దాం..

తోటకూర అలసందల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
అలసందలు- ముప్పావు కప్పు
నీళ్లు- ఒకటిన్నర గ్లాసులు
తోటకూర- రెండు కట్టలు
పచ్చి కొబ్బరి ముక్కలు- ముప్పావు కప్పు
పచ్చిమిర్చి- ఐదు
అల్లం- ఒకటిన్నర ఇంచు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
మినప్పప్పు- టీస్పూన్
ఎండు మిర్చి- రెండు
జీలకర్ర- పావు టీస్పూన్
ఇంగువ- కొద్దిగా
ఉల్లిపాయలు- అర కప్పు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
బెల్లం- చిన్న ముక్క
తోటకూర అలసందల కూర తయారీ విధానం
ముందుగా అలసందలను కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వీటిని కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఈ లోపు తాజా తోటకూరను తీసుకుని కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు వేసి నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసుకోవాలి.

స్టవ్‌పైన పాన్ పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి.
ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తోటకూర మగ్గిన తర్వాత బెల్లం, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరికాసేపు ఉడికించుకోవాలి.
ఈ లోపు ఉడికించిన అలసందల్లో కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా వాటిని రుబ్బుకోవాలి. పక్కకు పెట్టిన అలసందలను కూరలో వేసి ఉడికించాలి.
తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్, రుబ్బుకున్న అలసందల మిశ్రమం వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపైన దగ్గరికి ఉడికించాలి. కూర అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్తీ తోటకూర అలసందల కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
