Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మంగళూరు స్పెషల్ మటన్ ఘీ రోస్ట్..తింటుంటే ఆ మజానే వేరు..ఎలా చేసుకోవాలంటే
మటన్ ఘీ రోస్ట్ మంగళూరులో చాలా ఫేమస్ వంటకం. ఇది కారంగా, సువాసనగా, నెయ్యి రుచితో కూడిన అద్భుతం. మటన్ (మేక మాంసం) నెయ్యిలో రోస్ట్ చేయబడి, ప్రత్యేకమైన మసాలా మిశ్రమంతో కలిపి వండుతారు. దీని అద్భుతమైన రుచి, దాని ప్రత్యేకమైన తయారీ విధానం వల్ల చాలా మంది ఆహార ప్రియుల అభిమానాన్ని చూరగొంది. అన్నం, రోటీ, నాన్, దోస లేదా నీర్ దోస వంటి వాటితో ఇది చాలా రుచిగా ఉంటుంది. మటన్ ఘీ రోస్ట్ ని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మటన్ ఘీ రోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు
-మటన్: 500 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
-పసుపు: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
-ఎండు మిర్చి (కాశ్మీరీ): 8-10
-సాధారణ ఎండు మిర్చి: 4-5
-ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర: 1 టీస్పూన్
-సోంపు గింజలు: 1 టీస్పూన్
-నల్ల మిరియాలు: 1 టీస్పూన్
-లవంగాలు: 4-5
-యాలుకలు: 2-3
-దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
-మెంతులు: 1/4 టీస్పూన్
-వెల్లుల్లి రెబ్బలు: 6-8
-అల్లం: 1 అంగుళం ముక్క
-చింతపండు: చిన్న నిమ్మకాయంత
-నెయ్యి: 6 టీస్పూన్
-ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది)
-కరివేపాకు: గుప్పెడు
-బెల్లం పొడి: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-కొత్తిమీర తరుగు: కొద్దిగా
మటన్ ఘీ రోస్ట్ తయారీ విధానం
-మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా వడకట్టాలి.
-ఒక పెద్ద గిన్నెలో మటన్ ముక్కలు తీసుకుని దానికి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి బాగా మ్యారినేట్ చేయాలి. కనీసం 1 గంట వరకు పక్కన పెట్టాలి. వీలైతే రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే రుచి బాగా పడుతుంది.
-తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ లో మ్యారినేట్ చేసిన మటన్ వేసి సుమారు అర కప్పు నీరు పోసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ మెత్తగా ఉడకాలి కానీ మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు.
-మటన్ ఉడికిన తర్వాత, గ్యాస్ ఆపి, ఆవిరి తగ్గిన తర్వాత మూత తీయాలి. మటన్ నుండి వచ్చిన నీటిని వేరు చేసి మటన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ స్టాక్ మసాలా పేస్ట్ కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది.ః
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేసి ఇందులో ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల మిరియాలు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, మెంతులు వేసి చిన్న మంటపై సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపి, వాటిని చల్లబరచాలి.
-చల్లారిన తర్వాత ఈ వేయించిన మసాలా దినుసులను ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి..దీనిలో వెల్లుల్లి, అల్లం, నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి అవసరమైతే కొద్దిగా మటన్ స్టాక్ లేదా నీరు కలుపుతూ మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద మందపాటి బాండీ లేదా కడాయిని స్టవ్ మీద పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక, తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
Mutton Kurma: సూపర్ టేస్టీ మటన్ కుర్మా..నోటికి స్వర్గం అంతే..ఎలా చేసుకోవాలంటే
-ఇప్పుడు అందులో సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. మసాలా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా 5-7 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు మిగిలిన మటన్ స్టాక్ రుచికి సరిపడా ఉప్పు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. మటన్ పూర్తిగా డ్రై అయ్యే వరకు లేదా మీకు నచ్చిన విధంగా ఘీ రోస్ట్గా మారే వరకు చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. నెయ్యి అంతా మటన్‌కు పట్టి మసాలా ముక్కలకు అంటుకునేలా వేయించాలి.
-చివరగా 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని పైన వేసి కొద్దిసేపు వేయించి స్టవ్ ఆపివేయాలి.
-తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నం, రోటీ లేదా దోసతో సర్వ్ చేసుకోవడమే. ఇది నెయ్యి, మటన్ తో కూడిన వంటకం కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




