Latest Updates
-
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా..
వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో ఉదయాన్నే ఏదైనా వేడివేడిగా, కారంగా, అద్భుతమైన రుచితో బ్రేక్ ఫాస్ట్ తినాలని చాలామందికి అనిపిస్తుంటది. అందులోనూ మీరు నాన్ వెజ్ ప్రియులైతే, ఉదయాన్నే చికెన్ తో చేసిన వెరైటీ వంటకం దొరికితే ఆ రోజంతా పండుగే. అందుకే ఈసారి కొత్తగా చికెన్ కీమా పరాఠా ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్ రుచితో మీ ఇంట్లోనే ఈజీగా చికెన్ కీమా పరాఠా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - అర టీస్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
నీరు - తగినంత
స్టఫింగ్ (కూర) కోసం:
చికెన్ కీమా - 300 నుండి 400 గ్రాములు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి, గరం మసాలా - ఒక్కోటి 1 టేబుల్ స్పూన్
ఆమ్చూర్ పొడి - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
చికెన్ కీమా పరాఠా తయారీ విధానం
-ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి బాగా కలపండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోండి. దీనిపై ఒక మూత పెట్టి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు చికెన్ కీమా వేసి 3 నిమిషాలు వేయించాక.. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
-చికెన్ ఉడికి, అందులో ఉన్న నీరంతా ఇంకిపోయి డ్రైగా మారేంతవరకు సుమారు 10 నిమిషాలు సన్నని మంటపై ఉడికించండి. చివరగా కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం చల్లి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను కొద్దిగా పూరీలా ఒత్తి, అందులో చల్లారిన చికెన్ మిశ్రమాన్ని ఉంచండి. అంచులన్నీ దగ్గరకు తీసుకువచ్చి మూసివేయండి. ఇప్పుడు పొడి పిండి చల్లుతూ.. లోపలి కూర బయటకు రాకుండా నెమ్మదిగా, కాస్త మందంగా పరాఠాలా ఒత్తుకోండి.
-స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేయండి. ఒత్తుకున్న పరాఠాను పెనంపై వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చండి. ఆ తర్వాత నెయ్యి లేదా నూనె రాస్తూ, పరాఠా మంచి బంగారు వర్ణంలోకి వచ్చేలా రెండు వైపులా దోరగా కాల్చుకోండి.
-అంతే గుమగుమలాడే వేడి వేడి చికెన్ కీమా పరాఠాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
