ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌.!

ఈ రోజుల్లో చాలా మంది తమ ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యంపైన అవగాహన, పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు, ఒంటి నొప్పులు. ముప్పై రాకముందే ఎముకల నొప్పులు, బలహీనత ఆవహిస్తోంది. వీటి నుంచి బయటపడేందుకు తమ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా జావ లాంటి వంటకాలు, ప్రొటీన్‌ లడ్డూలు ఇలా ఎన్నో.. ఈ క్రమంలో రోజూ ఉదయం ఇది కప్పు తాగితే చాలు, ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని అందిస్తుంది. అదే మినప్పప్పు పాయసం.

Urad dal payasam that relieves body aches and boosts strength healthy breakfast

మినప్పప్పులో ఎన్నో పోషకాల మేళవింపు ఉంది. ముఖ్యంగా ఎముకలను దృఢంగా మార్చి, బలాన్ని అందించడంలో దీనికి మించిన మెడిసిన్‌ ఇంకోటి లేదు. అందుకే దోశ, ఇడ్లీలు, వడలు, సున్నుండల్లో మినప్పప్పు కింగ్‌. అలాంటి దివ్య ఔషధంతో ఇలా పాయసం చేసుకుని రోజూ ఉదయాన్నే తాగండి. కొన్ని రోజుల్లోనే ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మినప్పప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం..

మినప్పప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు

నెయ్యి- టీస్పూన్‌
జీడిపప్పు పలుకులు- పది
బాదం పప్పు పలుకులు- ఐదు
పచ్చికొబ్బరి తురుము- పావు కప్పు
మినప్పప్పు- పావు కప్పు
బియ్యం- టీస్పూన్‌
మెంతులు- చిటికెడు
బెల్లం- ముప్పావు కప్పు
నీళ్లు- రెండున్నర కప్పులు
ఏలకుల పొడి- టీస్పూన్‌

మినప్పప్పు పాయసం తయారీ విధానం

ముందుగా స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో నెయ్యి వేసి కట్‌ చేసిన జీడిపప్పు, బాదంపప్పు పలుకులు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేవరకు దోరగా వేగనివ్వాలి. కమ్మటి వాసన వస్తున్నప్పుడు వేరే ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి..

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.!

ఇప్పుడు అదే బాణలిలో మినప్పప్పు, బియ్యం వేసి దోరగా వేయించండి. మినప్పప్పు వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది. చివర్లో కొన్ని మెంతులు మరి కాసేపు వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వండి.

చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేసుకోండి. ఇప్పుడు అదే బాణలిలో బెల్లం వేసి కాసిన్ని నీళ్లు పోసి కరగనివ్విండి. కరిగిన తర్వాత బెల్లం పానకాన్ని వడగట్టుకోండి.

Urad dal payasam that relieves body aches and boosts strength healthy breakfast

బాణలిలో నీళ్లు పోసి కాగనివ్వండి. ఇప్పుడు గ్రైండ్‌ చేసుకున్న పిండిని బౌల్‌లో వేసుకుని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి. కాగుతున్న నీళ్లలో ఈ పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. దాదాపు 10 నిమిషాల పాటు సన్నని మంటపైన బాగా ఉడకనివ్విండి.

మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

ఉడుకుతున్నప్పుడు బెల్లం పానకం వేసి కలిపి మరికాసేపు ఉడికించండి. ఏలకుల పొడి వేసి కలిపిన తర్వాత నిమిషం పాటు ఉడికించి చివర్లో జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమాన్ని వేసుకోండి. స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వండి.

రుచి, ఆరోగ్యకరమైన మినప్పప్పు పాయసం రెడీ. ఈ పాయసాన్ని రోజూ ఒక కప్పు తింటే చాలు ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 7:32 [IST]
Desktop Bottom Promotion