Latest Updates
-
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..
శీతాకాలపు ఆరోగ్య సంజీవని..అందం,ఆరోగ్యం రెండూ..బీట్ రూట్ కంజి ఎలా తయారుచేసుకోవాలంటే..
శీతాకాలం ప్రారంభమవగానే చాలా మందికి జలుబు, దగ్గు, నీరసం వంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి. చలికాలంలో వాతావరణంలో ఉండే చల్లదనం మన జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే ఒక అద్భుతమైన సాంప్రదాయ పానీయం ఉంది..అదే కంజి. కంజి అనేది నార్త్ ఇండియాలో తయారయ్యే పులియబెట్టిన, ప్రోబయోటిక్ పానీయం. దీనిని ప్రధానంగా క్యారెట్లు, బీట్ రూట్స్ తో చేస్తారు. కంజిని పోషకాల గని అయిన బీట్ రూట్ తో తయారు చేస్తే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
పులియబెట్టే ప్రక్రియ ద్వారా అందులోని పోషకాలు మన శరీరానికి సులభంగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా ఈ ప్రక్రియలో మన పేగులకు మేలు చేసే మంచి బాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్కిన్ హెల్త్ మెరుగవుతుంది. చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బీట్ రూట్ కంజిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బీట్ రూట్ కంజి తయారీకి కావాల్సిన పదార్థాలు
-కారం
-ఆవాల పౌడర్
-ఉప్పు
-నల్ల ఉప్పు
-వేడి నీళ్లు
-బీట్ రూట్
-కారం
-మిరియాల పొడి
బీట్ రూట్ కంజి తయారీ విధానం
-ముందుగా ఒక బీట్ రూట్ తీసుకొని దాని పైన స్కిన్(చెక్కు)ను తొలగించాలి.
తర్వాత దానిని లావాటి స్లైసులుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఓ జగ్గులో కట్ చేసుకున్న బీట్ రూట్ పీసులు, మిరియాల పొడి అర టీస్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాల పౌడర్ 3 టీస్పూన్లు, నల్ల ఉప్పు 1 టీస్పూన్, కొంచెం కారం పొడి, ఒకటిన్నర లీటరు వేడి నీళ్లు పోసి గరిటతో బాగా కలిపి జగ్గుమీద మూతపెట్టి క్లోజ్ చేసేయండి. ఈ జగ్గును 2-3 రోజులు సన్ లైట్(సూర్యుడి కాంతి)లో ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒకసారి శుభ్రమైన గరిటెతో కలుపుతూ ఉండాలి.
- ఆ జగ్గును సన్ లైట్ తో ఉంచడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా నానతాయి. 2-3 రోజులకు కంజి నుండి కొద్దిగా పుల్లని వాసన రావడం మొదలవుతుంది. దాని రంగు ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. రుచి చూస్తే కొద్దిగా పుల్లగా, కారంగా ఉంటుంది. ఇదే కంజి సిద్ధమైనదనడానికి సంకేతం.
-కంజి సిద్ధమైన తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచి వారం నుండి పది రోజుల వరకు వాడుకోవచ్చు. చల్లగా తాగితే దీని రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications