Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
నిత్యామీనన్ స్టైల్ లో బంగాళదుంప వేపుడు..పిల్లలు ఎగబడి తింటారు
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్, తన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా చాలా సహజత్వాన్ని కోరుకుంటారు. నిత్యామీనన్ ఓ ఇంటర్వూలో బంగాళదుంప ఫ్రై తాను ఎలా చేస్తానో వివరించింది.
నిత్యామీనన్ చెప్పిన పొటాటో ఫ్రై రెసిపీకి సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల నుంచి పెద్ద రెస్ఫాన్స్ వచ్చింది. సాధారణంగా మనం చేసుకునే ఫ్రై కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. బాండీలో కాకుండా దోశలు పోసుకునే పాన్ మీదనే ఈ బంగాళదుంప ఫ్రై చేసుకోవచ్చు. నిత్యామీనన్ స్టైల్ లో బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంప
-ఉప్పు
-కారం
-పసుపు
-గరం మసాలా
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు బంగాళదుంపను స్లైసులుగా అంటే పొటాటో చిప్స్ షేపులో కట్ చేసుకోవాలి.
-కట్ చేసుకున్న బంగాళదుంప స్లైసుల మీద ఉప్పు, కారం, పసుపు వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఈ ముక్కలపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక అందులో కొంచెం నెయ్యి వేసి అది కరిగాక కలిపి పక్కన పెట్టుకున్న బంగాళదుంప స్లైసులను ఒక్కొక్కటిగా పెనం మీద పెట్టి కాల్చుకోవాలి. రెండువైపులా మంచి రంగులోకి మారేదాకా ఫ్రై చేయాలి.
-చివర్లో దానిమీద వేయించిన కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆపేయాలి. అంతే సూపర్ టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ. ఈ పద్ధతిలో చేస్తే బంగాళదుంప అంటూ దూరంగా జరిగే పిల్లలు, పెద్దలు కూడా ఎగబడి తినడం ఖాయం.
ముఖ్య ప్రయోజనాలు
చాలామంది బంగాళాదుంప అనగానే బరువు పెరుగుతాం,గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని భయపడుతుంటారు. కానీ మితంగా తీసుకుంటే బంగాళాదుంప అద్భుతమైన పోషకాల గని. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోజంతా చురుకుగా ఉండాలనుకునే వారికి, పిల్లలకు, శారీరక శ్రమ చేసేవారికి ఇది ఒక మంచి ఆహారం. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే అరటిపండు కంటే బంగాళాదుంపలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తనాళాలను వెడల్పు చేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి పొటాషియం చాలా అవసరం.
బంగాళాదుంపలో ఉండే విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు చర్మానికి చాలా మంచివి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications