Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
రెస్టారెంట్ రుచిని మైమరిపించే దహీ మటన్..ఇలా వండితే ముక్క వెన్నలా కరిగిపోవాల్సిందే!
మటన్..ఈ పదం వినగానే మాంసాహార ప్రియులకు నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అయితే ఇంట్లో వండే మటన్ ఒక్కోసారి రెస్టారెంట్ రుచిని తీసుకురాలేదు. మసాలాలు ఎక్కువవడమో, నూనె తేలిపోవడమో జరుగుతుంటుంది. సరైన కొలతలు, వండే పద్ధతి తెలిస్తే.. మీ వంటగది కూడా ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ను తలపించడం ఖాయం.
సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మీరు వండిన మటన్ కర్రీకి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. మీ ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని మించిన దహీ మటన్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

దహీ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మటన్
-పెరుగు
-పసుపు
-ఆవ నూనె
-ధనియాల పొడి
-ఉల్లిపాయ చీలికలు
-జీలకర్ర పొడి
-కారం
-ఉప్పు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకు
-యాలకలు
-ఎండుమిరపకాయలు
-టమాటో ముక్కలు
-గరం మసాలా
-కొత్తిమీర
దహీ మటన్ తయారీ విధానం
-ముందుగా కిలో మటన్ ను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మటన్ ముక్కలు వేసి అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆవ నూనె, కమ్మటి గట్టి పెరుగు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టి నూనె వేడి చేయండి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్.. మటన్ లో సహజంగానే కొవ్వు ఉంటుంది, ఉడికేటప్పుడు అది కూడా నూనెను వదులుతుంది. కాబట్టి నూనె తక్కువగా వాడటం ఆరోగ్యానికే కాదు, కూర రుచికి కూడా మంచిది.
-నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి, మంటను హై ఫ్లేమ్ లో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ బాగా వేయించాలి.
-మటన్ కొద్దిగా వేగాక, అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, యాలకులు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. మసాలాలు వేగాక, సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేయండి.
-టమోటాలు పూర్తిగా గుజ్జులా మారి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి నిదానంగా ఉడకనివ్వాలి. మటన్ అడుగు అంటకుండా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. గ్రేవీ కోసం అవసరమైతే కొద్దిగా నీళ్లను కలుపుకోవచ్చు.
-మటన్ ముక్క మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత.. పైన కాస్త గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన స్పెషల్ పెరుగు మటన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నం, చపాతీ, లేదా పరాటాతో ఈ మటన్ గ్రేవీని కలుపుకుని తింటుంటే ఆ రుచికి మాటలు చాలవు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications