Latest Updates
-
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.!
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే!
పండగ వచ్చినా లేదా సాయంత్రం వేళ ఇంట్లో వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా మనకు ముందుగా గుర్తొచ్చేవి తీపి పదార్థాలే. అందులోనూ బూరెలుఅంటే ఇష్టపడని తెలుగు వారు ఉండరు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన ఈ రోజుల్లో మైదాతో చేసే స్వీట్స్ తినడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్వీట్ ఏదైనా ఉందా అంటే.. ఖచ్చితంగా రాగి బూరెలు అని చెప్పవచ్చు. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే రాగులతో, ఎలాంటి మైదా వాడకుండా ఎంతో క్రిస్పీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి బూరెలు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
బెల్లం - 1 కప్పు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
రాగి బూరెలు తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ లేదా గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం నీళ్లలో కరిగితే చాలు.
-బెల్లం కరిగిన తర్వాత, ఆ వేడి నీటిని ఒక వడపోత సహాయంతో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమంలో పోయాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే తొలిగిపోతాయి. ఇప్పుడు గరిటెతో పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొద్దికొద్దిగా సగం కప్పు గోరువెచ్చని నీటిని కలుపుతూ ఉండలు లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి. బూరెలు వేసుకోవడానికి వీలుగా పిండి జారుగా ఉండాలి.
-కలుపుకున్న పిండిపై మూతపెట్టి కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బూరెలు మెత్తగా, బాగా పొంగుతూ వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. మీ చేతులకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వదులుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి బూరెలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా, కరకరలాడేలా వేయించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications