Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్!
ఉరుకుల పరుగుల ఉదయం.. సమయం ఏమో తక్కువగా ఉంటుంది, కానీ కడుపు నిండా రుచికరమైన అల్పాహారం తినాలనిపిస్తుంది. ప్రతిరోజూ అవే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే, ఆరోగ్యకరమైన కొత్త బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ టమాటో సెట్ దోశ. ఆఫీసులకు వెళ్లే బ్యాచిలర్స్కి ఇది ఒక బెస్ట్ టైమ్ సేవింగ్ ఆప్షన్.
అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఉన్న గోధుమ పిండి, విటమిన్లు ఉన్న టమాటాలు వాడటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతో పోషకకరమైన ఎంపిక. ఈ దోశ కోసం పప్పు నానబెట్టాల్సిన పనిలేదు, ముందు రోజు రాత్రి పిండి రుబ్బి పులియబెట్టాల్సిన అవసరం అస్సలే లేదు. కేవలం పది నిమిషాల వ్యవధిలో, ఎంతో మృదువుగా, స్పాంజిలాంటి వేడి వేడి దోశలను మీ ప్లేట్ లోకి ఇట్టే తెచ్చుకోవచ్చు.

టమాటో సెట్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ
గోధుమ పిండి
ఎర్రటి టమాటాలు
పచ్చిమిర్చి
అల్లం
వెల్లుల్లి రెబ్బలు
జీలకర్ర
పెరుగు
ఉప్పు
వంట నూనె
బేకింగ్ సోడా లేదా ఈనో
టమాటో సెట్ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. వీటన్నింటినీ తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే పిండి మరీ నీళ్లలా పలచగా కాకుండా, సెట్ దోశకు సరిపోయేలా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో చిటికెడు బేకింగ్ సోడా లేదా ఈనో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పిండిపై మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నీటిని బాగా పీల్చుకుని, పిండి పర్ఫెక్ట్ స్టేజ్ కి చేరుకుంటుంది. దోశలు దూదిలా మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక, కాస్త నూనె రాసి గ్రీజ్ చేయండి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకుని పాన్ మధ్యలో వేయండి. సాధారణ దోశలా దీన్ని పలచగా రుద్దకూడదు. సెట్ దోశ కాబట్టి కాస్త మందంగానే ఉంచాలి.
-దోశ పైన చిన్న చిన్న రంధ్రాలు (బబుల్స్) రావడం మొదలవ్వగానే, పైన ఒక మూతపెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. ఆవిరికి ఉడకడం వల్ల దోశ లోపల దాకా ఉడికి చాలా సాఫ్ట్‌గా మారుతుంది. ఈ దోశను రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదు. ఒకవైపు కాలితే సరిపోతుంది. అంతే గుమగుమలాడే టమాటో సెట్ దోశ రెడీ.
-టమాటో సెట్ దోశను పచ్చికొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, పుదీనా చట్నీ లేదా కమ్మని బంగాళదుంప కూరతో ఆస్వాదించవచ్చు. ఎలాంటి చట్నీ లేకపోయినా వట్టి దోశను కూడా ఇష్టంగా తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
