Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా వడ చేయాలంటే మినపప్పు నానబెట్టాలి, పిండి రుబ్బాలి, ఆకారం సరిగ్గా రావాలి..ఇదంతా చాలా పెద్ద పని, ఎంతో కష్టమైన ప్రక్రియ అని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేడివేడిగా, కరకరలాడే వడలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
మన ఇళ్లలో తరచుగా బ్రెడ్ ముక్కలు మిగిలిపోతే వాటిని పడేస్తుంటాం. కానీ ఆ మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలతో ఎంతో రుచికరమైన, నోరూరించే వడ తయారు చేసుకోవచ్చు. ఈ వంటకం తయారీకి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ వడల రుచిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

మిగిలిపోయిన బ్రెడ్ తో వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలు - 7
బొంబాయి రవ్వ (సూజీ) - ఒక కప్పు
పుల్లటి లేదా తాజా పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూన్
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టీస్పూన్
కారం పొడి - ఒక టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
సాంబార్ మసాలా - ఒక టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - ఒక కప్పు
ఉప్పు-తగినంత
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
మిగిలిపోయిన బ్రెడ్ తో వడ తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను తీసుకుని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచి మిక్సీ జార్ లో వేయండి. బ్రెడ్ అంచులు ఉన్నా పర్వాలేదు. వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, సాంబార్ మసాలా, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా పసుపు, జీలకర్ర, కొత్తిమీర,ఉప్పు వేయండి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ, పిండిని చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లు కలపాలి.
-చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. అరచేతిలో పెట్టి వడలాగా కొద్దిగా ఒత్తి, మధ్యలో వేలితో రంధ్రం చేయండి. చూడటానికి అచ్చం రెగ్యులర్ మెదు వడ ఆకారం వచ్చేలా అన్నింటినీ సిద్ధం చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, సిద్ధం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. రెండు వైపులా తిప్పుతూ, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కరకరలాడేలా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే వేడివేడి బ్రెడ్ వడలు క్షణాల్లో రెడీ. వీటిని కొబ్బరి చట్నీ, టొమాటో కెచప్ లేదా సాంబార్ తో వడ్డిస్తే అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
