Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
బరువు పెరుగుతామనే భయం వద్దు.. ఈ సమ్మర్ కి షుగర్ ఫ్రీ కర్బూజా కుల్ఫీ ట్రై చేయండి!
ఎండాకాలం వచ్చేసింది. భానుడి భగభగలకు గొంతు ఆరిపోతూ.. చల్లగా, తియ్యగా ఏదైనా తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. కానీ, బయట దొరికే ఐస్ క్రీమ్స్ లో పంచదార, రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య స్పృహ ఉన్నవారు వాటికి దూరంగా ఉంటారు.
పంచదార లేకుండా, పూర్తిగా సహజసిద్ధమైన తీపితో, ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే ఒక అద్భుతమైన రెసిపి కర్బూజా స్టఫ్డ్ కుల్ఫీ. ఇది సహజంగానే తియ్యగా, ఎంతో క్రీమీగా, పౌష్టిక విలువలతో నిండి ఉంటుంది. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ మీరే చేసుకుంటారు.

కర్బూజా స్టఫ్డ్ కుల్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఒక కర్బూజా
-వాల్ నట్స్
-జీడిపప్పు
-బాదం పప్పు
-మఖానా
-తేనె
-దానిమ్మ గింజలు
కర్బూజా స్టఫ్డ్ కుల్ఫీ తయారీ విధానం
-ముందుగా ఒక తాజా కర్బూజాను తీసుకుని శుభ్రంగా కడగాలి. దాని పై భాగాన్ని గుండ్రంగా కోసి, లోపల ఉన్న గింజలను ఒక స్పూన్ సహాయంతో నెమ్మదిగా బయటకు తీయాలి. (ఈ గింజలను పారేయకండి, వీటితో రుచికరమైన క్రీమ్ డ్రింక్ చేసుకోవచ్చు).
-ఇప్పుడు కర్బూజా పై తొక్క దెబ్బతినకుండా, లోపల ఉన్న మెత్తటి గుజ్జును జాగ్రత్తగా స్పూన్ తో తీసి ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. కప్పులా మారిన కర్బూజాను పక్కన పెట్టుకోవాలి.
-మిక్సీ జార్ లో ఉన్న కర్బూజా గుజ్జుకు వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, మరియు మఖానా జతచేయాలి. రుచికి సరిపడా తేనెను ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన, చిక్కటి క్రీమీ మిశ్రమం తయారవుతుంది.
-తయారైన క్రీమీ మిశ్రమాన్ని తీసుకుని, ముందుగా మనం ఖాళీ చేసి పెట్టుకున్న కర్బూజా లోపల నిండుగా పోయాలి. దీని పైన అందంగా, ఎర్రటి తాజా దానిమ్మ గింజలను చల్లుకోవాలి. ఇవి కుల్ఫీకి మంచి క్రంచీ రుచిని ఇస్తాయి.
-ఇప్పుడు ఈ కర్బూజాను డీప్ ఫ్రిజ్ లో కనీసం 8 నుండి 12 గంటల పాటు ఉంచాలి. అప్పుడే అది గట్టిపడి కుల్ఫీలా మారుతుంది.
-పూర్తిగా గట్టిపడిన తర్వాత ఫ్రిజ్ లోంచి బయటకు తీసి, చాకుతో అందమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే 'హెల్తీ సమ్మర్ కర్బూజా కుల్ఫీ రెడీ.
దీని ప్రత్యేకత ఏమిటి?
ఇందులో ఎలాంటి కృత్రిమ చక్కెరలు లేవు. డ్రై ఫ్రూట్స్ లోని ప్రొటీన్,
కర్బూజాలోని చలువ చేసే గుణం, తేనెలోని సహజ తీపి కలగలిసి దీనిని ఒక
పర్ఫెక్ట్ సమ్మర్ డెజర్ట్ గా మార్చాయి. డైట్ లో ఉన్నవారు కూడా కమ్మగా
ఆస్వాదించవచ్చు. పిల్లలకైతే ఇది భలే నచ్చుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
