Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
ఇంట్లో కూరగాయలు లేవా? ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో అదిరిపోయే 3 కూరలు ఎలా చేయాలో చూడండి!
మండుటెండలో గంటల తరబడి వంటగదిలో ఉక్కబోతతో అల్లాడిపోవడం ఎవరికైనా కష్టమే. అందుకే వేసవిలో త్వరగా పూర్తయ్యే వంటకాల కోసం అందరూ వెతుకుతుంటారు. ఈ క్రమంలో ప్రముఖ చెఫ్ పంకజ్ భదౌరియా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఈ వేసవిలో ఎక్కువ సమయం వంటగదిలో గడపకుండా.. చపాతీ, పూరీ, రోటీల్లోకి, రైస్ లోకి అద్భుతంగా సరిపోయే, కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే మూడు అద్భుతమైన ఉల్లిపాయ కూరలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. మధ్యాహ్న భోజనంలోకి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఈజీగా చేసుకోగలిగే ఆ 3 ఉల్లిపాయ రెసిపిలు ఏంటో ఇక్కడ చూడండి.

చల్లదనాన్నిచ్చే పెరుగు - ఉల్లిపాయ కూర
వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తయారుచేయడానికి ముందుగా 4-5 ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి, ముందుగానే బాగా గిలకొట్టి పెట్టుకున్న పెరుగును అందులో వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి తక్కువ మంటపై కాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు ఉల్లిపాయ కూర రెడీ.
క్రీమీ మలై ప్యాజ్ (మలై ఉల్లిపాయ కూర)
క్రీమీగా ఉండే ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుంది. దీనికోసం చిన్న
పరిమాణంలో ఉండే ఉల్లిపాయలను (బేబీ ఆనియన్స్) తీసుకుని, తొక్క తీసి
పైభాగంలో సగానికి క్రాస్ కట్ (X ఆకారంలో) చేయాలి. ఉల్లిపాయలు
విడిపోకుండా చూసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసి ఈ
ఉల్లిపాయలను వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు వేయించాలి. అందులో
సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
తర్వాత పసుపు, కశ్మీరీ కారం వేసి 10 సెకన్ల పాటు వేయించి, అరకప్పు
నీళ్లు పోయాలి. హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు ఉడికించాక, ఒక కప్పు
ఫ్రెష్ క్రీమ్ వేసి మరో నిమిషం పాటు ఉడికించాలి. ఇందులో టమాటా లేదా
నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలు వేయకూడదు, వేస్తే క్రీమ్
విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఆమ్చూర్ పొడి, కొత్తిమీర చల్లుకుంటే
మలై ప్యాజ్ రెడీ.
శనగపిండి - ఉల్లిపాయ పొడి కూర
తేలికపాటి రుచితో ఉండే ఈ కూర కోసం 4 ఉల్లిపాయలను కొంచెం లావుగా
ముక్కలు చేసుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, అర
టీస్పూన్ జీలకర్ర, సోంపు, ఒక టీస్పూన్ దంచిన ధనియాలు వేయాలి. అందులోనే
ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మరోవైపు ఒక
గిన్నెలో కప్పు శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కశ్మీరీ
కారం, నూనె, నీళ్లు చల్లి బ్రెడ్ క్రంబ్స్ (పొడిపొడిగా) లాగా చేతులతో
కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి 3-4 నిమిషాల
పాటు కలుపుతూ వేయించాలి. శనగపిండి పచ్చివాసన పోయి చక్కటి సువాసన
రాగానే.. తగినంత ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, కసూరి మేతి వేసి బాగా
కలపాలి. చివరగా కొత్తిమీర, గరం మసాలా కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
