Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ కరకరలాడే ఉల్లిపాయ భుజియా చేసి చూడండి!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి పెద్దగా సమయం లేనప్పుడు, ఏ కూర వండాలో అర్థం కాక సతమతమవుతున్నారా? అయితే మీకు సరైన పరిష్కారం ఉల్లిపాయ భుజియా. మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉల్లిపాయలతో కేవలం ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే అత్యంత రుచికరమైన వంటకం ఇది. వేడి వేడి అన్నంలో పప్పుతో పాటు సైడ్ డిష్ గా లేదా చపాతీ, పరాఠాలోకి రోల్ లా చుట్టుకుని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కరకరలాడే ఉల్లిపాయలు, కారంగా ఉండే పచ్చిమిర్చి, సుగంధ ద్రవ్యాల కలయిక మీ భోజనానికి రెట్టింపు రుచిని తీసుకొస్తుంది.

ఉల్లిపాయ భుజియా తయారీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 3
ఆవనూనె- 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 7
పసుపు - అర టీస్పూన్
కారం - అర ముప్పావు టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉల్లిపాయ భుజియా తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయలను పొడవుగా కోసుకోవాలి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉల్లిపాయలను మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా కోసుకోవాలి. అప్పుడే అవి వేగినప్పుడు క్రంచీగా ఉండి, తినేటప్పుడు భలే రుచిగా తగులుతాయి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె లేదా నెయ్యి వేసి బాగా పొగలు వచ్చేలా వేడి చేయండి. ఆవనూనె వాడటం వల్ల ఈ భుజియాకి నార్త్ ఇండియన్ స్టైల్ ఘాటైన రుచి వస్తుంది.
-నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తరువాత ఎండుమిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు నూనెలో వేగనివ్వండి. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి సుమారు 20-30 సెకన్ల పాటు వేయించండి. వెల్లుల్లి దోరగా వేగి కమ్మటి వాసన రావాలి కానీ, రంగు మారి మాడిపోకూడదు.
-ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి కడాయిలో వేసుకోవాలి. కేవలం ఒక నిమిషం పాటు నూనె అంతా ఉల్లిపాయలకు పట్టేలా గరిటెతో కలుపుతూ వేయించండి. ఇక్కడ ఉల్లిపాయలు మరీ మెత్తబడకూడదు, వాటి కరుకుదనం అలాగే ఉండాలి.
-ఉల్లిపాయలు కాస్త వేడెక్కిన తర్వాత.. అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి కేవలం 1-2 నిమిషాలు ఉడికించండి. మసాలాల పచ్చివాసన పోతే చాలు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి మారకూడదు, అలాగే పేస్ట్‌లా ముద్దగా అవ్వకూడదు.
-ఈ వంటకంలో అతి ముఖ్యమైన స్టెప్ ఇదే. వంటకం దాదాపు పూర్తయ్యాక మాత్రమే రుచికి సరిపడా ఉప్పు చల్లాలి. ముందే ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లోంచి నీరు ఊరి, అవి మెత్తబడిపోయి క్రంచీనెస్ పోతుంది. కాబట్టి ఉప్పు ఎప్పుడూ చివర్లోనే వేయాలి.
-ఉప్పు వేసి ఒకసారి కలిపాక, స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీరను గుప్పెడు తీసుకుని ఉల్లిపాయల పైన చల్లి బాగా కలపండి. కొత్తిమీర ఈ వంటకానికి అద్భుతమైన సువాసనను ఇస్తుంది.
-అంతే ఎంతో గుమగుమలాడే, కరకరలాడే ఉల్లిపాయ భుజియా రెడీ. వేడి వేడి అన్నంలోకి లేదా పుల్కాలోకి ఈ భుజియాను వడ్డించి చూడండి.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
