Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బట్టర్ ఫిష్ ఫ్రై - బెంగాల్ ఫేవరెట్ రిసిపి
బట్టర్ ఫిష్ ఫ్రై పాపులర్ బెంగాల్ రిసిపి. చాలా సింపుల్ గా చేయదగినటువంటి వంటకం. చాలా సింపుల్ గా ఫిష్ ఫిల్లెట్ ను బట్టర్ తో మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై రిసిపితో గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫిష్ బటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బెంగాల్ లో చాలా పాపులర్ అయిన ఫేవరెట్ వంటకం. పెళ్ళి రోజు లేదా బర్త్ డే పార్టీలకు ఓ మంచి టేస్ట్ ఉన్న ఈ బెంగాల్ ఫేవరెంట్ ఫిష్ ఫ్రై మనం కూడా చేసుకోవచ్చు. వండే పదార్థాలు కొంచెం ఎక్కువైన రుచి అద్భుతంగా ఉంటుంది. సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
సాల్మన్ ఫిష్ ఫిల్లెట్: 1can
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
నిమ్మరసం: 1tbsp
కారం: 1tbsp
జీడిపప్పు: 1/4cup(పేస్ట్ చేసుకోవాలి)
బాదం: 1/4cup(పేస్ట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్: 1-2cups
గుడ్డుం 2
పాలు: 1/2cup
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tbsp
బట్టర్: 1cup
కుకుంబర్(కీరదోసకాయ): 1(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో సాస్: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం, కారం, జీడిపప్పు- బాదం పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత సాల్మన్ ఫిష్ ఫిల్లెట్ ను బాగా శుభ్రం చేసి పై మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించి అరగంట లేదా గంట సేపు అలా పెట్టేయాలి
3. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, గుడ్డు, పాలు, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి జారడు పిండిలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని గ్యాస్ స్టౌ మీద పెట్టి నూనె వేసి మీడియం మంట పెట్టాలి.. అంతలోపు ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కలను కార్న్ ఫ్లోర్ పిండి మిశ్రమంలో వేసుకోవాలి.
5. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఉన్న ఫిష్ ముక్కలను పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకొన్న తర్వతా స్వర్ చేయాలి. అంతే బట్టర్ ఫిష్ ఫ్రై రెడీ...
సర్వింగ్ : ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఫ్రై చేసుకొన్న చేప ముక్కలను సర్దుకోవాలి.
తర్వాత కట్ చేసి పెట్టుకొన్న కుకుంబర్, టమోటో, మరియు ఉల్లిపాయ చక్రాలను గార్నిష్ చేయాలి. అంతే టమోటో సాస్ తో బట్టర్ ఫిష్ ఫ్రై ను వేడి వేడిగా సర్వ్ చేయాలి అంతే...



Click it and Unblock the Notifications