Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చికెన్ మోమోస్ వంటకం

దో(మైదా ముద్ద కోసం):
మైదాపిండి: 2cups
ఉప్పు: 1/2tsp
నీళ్లు: పిండి కలుపుకోవడానికి సరిపడా
పిండిలో నింపడం కోసం కావలసిన పదార్థాలు:
బోన్‌పూస్ చికెన్: 1/2kg
ఉల్లిపాయ: 1
సోయాసాస్: 1tbsp
చిల్లిసాస్: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: ఒక కట్ట
మిరియాల పొడి: 1tbsp
వెనిగర్: 1tsp
నూనె, ఉప్పు, కారం: కావలసినంత
తయారు చేయు విధానం:
1. మైదాపిండిలో ఉప్పు, కొంచెం నూనె, వేడినీళ్లు పోసి బాగా కలపి చపాతి ముద్దలాచేసుకోవాలి. దీన్ని ఒక తడిగుడ్డలో వేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఓ గిన్నెలో చికెన్ వేసి నీళ్లు పోయాలి. నీళ్ళు ఆవిరి అయ్యే వరకు ఉడికించి చిదిమి పెట్టుకోవాలి.
3. ఆ తరువాత ఒక పాన్ లో కొంచెం నూనె పోసి ఉల్లిపాయముక్కలను బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలపొడి, వెనిగర్, ఉప్పు, కారం వేసి ఐదు నిమిషాల పాటు కలపాలి.
4. ఇప్పుడు చికెన్ వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ, అందులోనే సోయాసాస్ ను కూడా వేసి బాగా కలుపి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా కలుపిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. దాంట్లో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి, గుండ్రని ఆకారం వచ్చేలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇలా కావల్సినన్ని తయారు చేసి పెట్టుకొని, ఆ తరువాత వీటిని 20 నిమిషాలు మోమో స్టీమర్ లో పెట్టి ఉడికించాలి, అంతే నోరూరించే చికెన్ మోమోస్ రెడీ.. దీనిని టమాటో గార్లిక్ సాస్ లేదా చిల్లిసాస్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications