Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
హాట్ అండ్ స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై
చికెన్ పెప్పర్ కార్న్ రిసిపి ఇండియన్ నాన్ వెజ్ వంటకాల్లో స్పెషల్. ఈ పెప్పర్ చికెన్ నోరూరిస్తే స్పైసీగా తింటుంటే కళ్ళవెంబడి నీళ్ళు రావాల్సిందే. ఈ స్పెషల్ పెప్పర్ చికెన్ తయారు చేయడం చాలా సులభం. మీరు కనుక స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతున్నట్లైతే ఈ పెప్పర్ చికెన్ కొన్ని నిముషాల్లో తయారు చేసేయొచ్చు .
ఈ స్పైసీ ఇండియన్ చికెన్ పెప్పర్ ఫ్రై అతిథులకు ప్రత్యేకంగా వండ్డించవచ్చు. పార్టీకి, ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసుకొనే ఈ చికెన్ రిసిపి సైడ్ డిష్ గా బాగా నప్పుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తయారు చేసి రుచి చూసేయండి...

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 8 to 10pieces(మీడియం సైస్)
మిరియాలు: 10-12
మిరియాల పొడి: 4tbsp
పచ్చిమిర్చి: 5(కట్ చేసుకోవాలి)
ఎండు మిర్చి: 3-4
కరివేపాకు : 8-10
ఉల్లిపాయలు: 2 (ఒకటి సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి, రెండవది పేస్ట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
వెనిగర్: 2tbsp
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. శుభ్రం చేసుకొన్న చికెన్ కు వెనిగర్, ఉల్లిపాయ పేస్ట్, మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక చెంచా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి చికెన్ కు పట్టేలా బాగా కలగలిపి 1గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. 1గంట తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో మిరియాలు వేసి చిట్లినతర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిగిలిన మిరియాల పొడి మరియు కరివేపాకు ఆకులు వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. ఫ్రై కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి 5 నిముషాల పాటు బాగా వేయించాలి. నీరు కలుపుకోవడం లేదు కాబట్టి మూత పెట్టి ఆవిరి మీద ఫ్రై చేసుకోవాలి.
5. మూత పెట్టిన తర్వాత పది నిముషాల పాటు ఆవిరిలో ఉడకనివ్వాలి. మధ్య మద్యలో మూత తీసి కలియబెడుతుండాలి. అప్పుడే చికెన్ ముక్కలు అన్ని పూర్తిగా ఉడుకుతాయి. దించుకొనే ముందుగా కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల చక్కాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే చికెన్ పెప్పర్ కార్న్ ఫ్రై రెడీ...



Click it and Unblock the Notifications