Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
చికెన్ -మ్యాంగో సాల్సా
వీకెండ్స్ లో విశ్రాంతి పొందడానికి సరిపడా టైమ్ దొరుకుతుంది. అంతే కాదు, వివిధ రకాల వెరైటీ రుచులను టేస్ట్ చూడటానికి కూడా సమయం దొరుకుతుంది. వెరైటీగా ఏదైనా తినాలంటే వీకెండ్స్ లో ట్రై చేసి కొత్త రుచులను రుచి చూడవచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ లవర్స్ కోసం బార్బక్యు చికెన్ ఒక అద్భుత రుచిని అందించే నాన్ వెజ్ రిసిపి.
కాబట్టి ఈ స్పెషల్ బార్బక్యు చికెన్ ను వెరైటీగా ఈ వీకెండ్ లో మీరు ట్రై చేసి, రుచి చూడవచ్చు. అంతే కాదు, కాస్త వెరైటీగా ఉండాలంటే అందులో మామిడి ముక్కలు వేసి తయారుచేసి నోరూరించే సాల్సా బార్బక్యు చికెన్ చాలా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది. మరి ఈ వెరైటీ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ ఫిల్లెట్స్-4 (100g) స్కిన్, బోన్ లెస్
తందూరి మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్ పౌడర్: రుచికి సరిపడా
ఆలివ్ నూనె: 1tbsp
వెల్లుల్లి రెబ్బలు: 2 (పేస్ట్ చేసుకోవాలి లేదా కచపచ దంచుకోవాలి)
తాజా అల్లం-1 (2cm) ముక్క (పేస్ట్ చేసుకోవాలి)
మామిడికాయల-2 (పొట్ట తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వినెగార్: 2tbsp
వైట్ వైన్: 1tsp
తాజా కొత్తిమీర-4tbsp (సన్నగా తరిగినవి)
తయారుచేయు విధానం:
1. ముందుగా బార్బక్యుని హై హీట్ లో పెట్టాలి మరియు లైట్ గా నూనె రాసి పెట్టాలి.
2. తర్వాత చికెన్ బ్రెస్ట్ కు తందూరి మసాల, ఉప్పు, మరియు పెప్పర్ ను చికెన్ బ్రెస్ట్ కు పట్టించాలి. మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గంట తర్వాత వీటిని బార్బక్యు మీద పెట్టి 10-15 బేక్ చేయాలి అన్ని సైడ్స్ బాగా కాలే విధంగా బేక్ చాయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ బేక్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేసి అందులో కచపచ దంచి పెట్టుకొన్న వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. 5. తర్వాత అందులోనే అల్లం ముక్కులు మరియు మామిడిముక్కలు కూడా వేసి మరో 3-4నిముషాలు అలాగే ఉండనివ్వాలి.
6. తర్వాత వాటి మీద వెనిగర్ మరియు వైట్ వైన్ ను పోసి, కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడర్ చిలకరించి ఫ్రై చేసుకోవాలి.
7. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని ముందుగా బేక్ చేసి పెట్టుకొన్న బార్బక్యు చికెన్ మీద పరవాలి. అంతే బార్బక్యు చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications