గ్రీన్ మసాలా ఫిష్ కర్రీ

Green Masala Fish Curry
కావలసిన పదార్థాలు:
చేపలు: 1/2(శుభ్రం చేసి కట్ చేసినవి)
కొత్తిమీరతురుము: 1
వెల్లుల్లి: 4-6రెబ్బలు
టమోటాలు: 2
లవంగాలు: 8-10
పచ్చిమిర్చి: 4-6(చిన్నగా కట్ చేసినవి)
మెంతులు: 1tsp
ధనియా: 1tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలకు పసుపు, ఉప్పు చేర్చి కలిపి ఇరవై నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చేపముక్కలను వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత కొత్తిమిర తురుము, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. మరొక పాన్ లో నూనె వేసి వేడి చేసి, అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, తక్కువ మంట మీద నూనె పైకి తేలేంత వరకూ బాగా వేగనివ్వాలి.
5. తర్వాత అందులోనే టమోట, మెంతులు మరియు మసాల పొడివేసి బాగా ఫ్రై చేయాలి.
6. అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి, చిక్కటి గ్రేవి తయారు చేసుకోవాలి.
7. ఇప్పుడు చేపముక్కలు అందులో వేసి పదినిమిషాలు ఉడకనిచ్చి పక్కకు దింపుకొని సర్వ్ చేయాలి అంతే గ్రీన్ మసాలా ఫ్రిష్ కర్రీ

Story first published: Saturday, May 19, 2012, 17:41 [IST]
Desktop Bottom Promotion