Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి!
మన ఇళ్లలో తరచుగా రాత్రి వండిన పప్పు మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని పారేయలేక, మళ్లీ తినలేక ఇబ్బంది పడుతుంటాం. అయితే ఆ మిగిలిపోయిన పప్పుతో ఉదయం పూట అద్భుతమైన, కమ్మని పప్పు పరాఠా చేసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? ఆహారం వృథా కాకుండా అడ్డుకోవడమే కాకుండా, కొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.

పప్పులో సహజంగానే ప్రోటీన్లు, మసాలాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటితో చేసే పరాఠాలు సాధారణ చపాతీల కంటే ఎన్నో రెట్లు రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే వారికి, పిల్లల లంచ్ బాక్స్ లలో పెట్టడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మిగిలిన పప్పును ఇలా వినియోగించడం వల్ల పోషకాలు వృథా కాకుండా శరీరానికి అందుతాయి. మిగిలిపోయిన పప్పుతో సూపర్ టేస్టీ పరాఠాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పప్పు పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన పప్పు - 1 కప్పు
గోధుమ పిండి - 2 కప్పులు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
కారం-తగినంత
పసుపు-తగినంత
ధనియాల పొడి -తగినంత
వాము - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె - పరాఠాలు కాల్చడానికి

పప్పు పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి వేయండి. ఇప్పుడు అందులో మిగిలిపోయిన పప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వాము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపండి. పప్పులో ఇప్పటికే తగినంత తేమ ఉంటుంది కాబట్టి, ముందుగా నీళ్లు పోయకండి. పిండిని ముద్దలా కలుపుతున్నప్పుడు, అవసరమైతేనే కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
-మీ పప్పు మరీ గట్టిగా, చిక్కగా ఉంటే, పిండిలో వేసే ముందు దానికి కొద్దిగా వేడి నీళ్లు కలిపి పల్చగా చేసుకోండి. పిండిని కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచండి. దీంతో పరాఠాలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి.
-కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుతూ, ఈ ఉండలను గుండ్రంగా పరాఠాల్లా ఒత్తుకోవాలి. ఇవి మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం మందంతో ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేయండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత పరాఠాను వేసి, రెండు వైపులా కొద్దికొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తూ కాల్చండి. పరాఠా పైన అందమైన బంగారు గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే పప్పు పరాఠా రెడీ.
-ఈ వేడి వేడి పరాఠాలను పెరుగు, కాస్త ఆవకాయ లేదా వెన్నతో తిని చూడండి ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications