For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ కోసం మలేషియన్ చికెన్ రెసిపీ

క్రిస్మస్ కోసం మలేషియన్ చికెన్ రెసిపీ

|

క్రిస్మస్ విందు ప్రత్యేకమైనది. మీరు ఇంట్లో పార్టీని ఏర్పాటు చేస్తుంటే, పండుగ రుచిని మీ ఇంటికి పూర్తిస్థాయిలో తీసుకురాగల కొన్ని సున్నితమైన వంటకాలను మీరు ప్లాన్ చేయాలి.

మీ ఇంట్లో ఉత్సహాన్ని పెంచడానికి మలేషియన్ చికెన్ అద్భుతమైన వంటకం. మీరు ఆగ్నేయ ఆసియా గురించి ఆలోచించినప్పుడు, మలేషియా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి, మరి అక్కడి అసాధారణమైన వంటకాల గురించి మీరు ఆలోచించవచ్చు.

ఆ అంతర్జాతీయ శైలి వంటను ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మీ వంటకాలలో చేర్చండి మరియు ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా మలేషియా చికెన్‌ను ప్రయత్నించండి. మీ ఇంట్లో పార్టీకీ ఈ వంటకంతో రాక్ చేస్తుంది మరియు ఇది చాలా రుచికరమైన వంట కావడంతో ఎక్కువ రోజుల పాటు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు, ఈ నోరూరించే వంటకు కావల్సిన పదార్థాలు మరియు రెసిపీపై దృష్టి పెట్టవలసిన సమయం వచ్చింది. మరింత తెలుసుకోవడానికి చదవండి.

Malaysian Chicken Recipe For Christmas

మలేషియన్ చికెన్ రెసిపీ, మలేషియా చికెన్ రెసిపీని తయారు చేయడం సులభం

ప్రిపరేషన్ సమయం

20 నిమిషాలు

వంట వండటానికి పట్టే సమయం

12 నిముషాలు

మొత్తం సమయం

32 నిమిషాలు

రెసిపీ: బోల్డ్స్కీ స్టాఫ్

రెసిపీ రకం: ప్రధాన కోర్సు

సర్వింగ్: ఇద్దరికి

కావల్సినవి:

ఎముకలతో ఉన్న చికెన్ లెగ్స్ - 250 గ్రాములు

కర్రీ పౌడర్ - 4 స్పూన్

వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్

నల్ల మిరియాలు - 1½ స్పూన్ (పొడి చేసినది)

ఓస్టెర్ సాస్ - 1½ స్పూన్

రుచికి సరిపడా ఉప్పు

డీప్ గా వేయించడానికి నూనె

అలంకరించడానికి గ్రీన్ స్ప్రింగ్ ఉల్లిపాయలు

ఎలా తయారుచేయాలి:

1. చికెన్ లెగ్స్ ను మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసి, వాటిని ఒక గిన్నెలో చేర్చండి.

2. చికెన్‌లో ఉప్పు, నల్ల మిరియాలు, వెల్లుల్లి పొడి, నూనె, ఓస్టెర్ సాస్ మరియు కర్రీ పౌడర్ వేసి బాగా మెరినేట్ చేయాలి.

3. ఇప్పుడు, డీప్ ఫ్రైయింగ్ కోసం పాన్ లోకి నూనె తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు, మెరినేటెడ్ చికెన్ ముక్కలను నూనెలో వేసి 2-3 నిమిషాలు అధిక మంట మీద ఉడికించాలి.

4. ఇప్పుడు, మంటను తగ్గించండి, తద్వారా చికెన్ లోపలి నుండి కూడా ఉడుకుతుంది.

5. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత, స్టౌ మీద నుండి క్రిందికి దింపి ఉంచండి.

6. మలేషియా చికెన్ సిద్ధంగా ఉంది. స్పింగ్ ఉల్లిపాయలతో అలంకరించండి మరియు మీకు ఇష్టమైన డిప్ తో సర్వ్ చేయండి.

సూచనలు

1. ఉత్తమ రుచి కోసం, వేయించడానికి ముందు అరగంట సేపు రిఫ్రిజిరేటర్‌లో చికెన్ మిక్స్ ఉంచండి (డీప్ ఫ్రీజ్ నివారించండి).

న్యూట్రిషనల్ సమాచారం

అందిస్తున్న పరిమాణం - ఇద్దరికి

కేలరీలు - 563 కేలరీలు

కొవ్వు - 3 గ్రా

కార్బోహైడ్రేట్లు - 85 గ్రా

చక్కెర - 0.14 గ్రా

ఫైబర్ - 4 గ్రా

English summary

Malaysian Chicken Recipe For Christmas

Christmas dinner is special. If you are arranging a home party, then you should plan certain exquisite dishes that can bring the flavor of the festival to the fullest to your house.
Desktop Bottom Promotion