Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
రంజాన్ స్పెషల్: మొఘలాయ్ మటన్ కుర్మా
రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. అటువంటి స్పెషల్ డిష్ లలో మొఘలాయ్ మటన్ ఒకటి. మొఘల్ కాలం నాటి రాయల్ ఫ్యామీలీ నుండి వచ్చిన ఈ మొఘలాయ్ మటన్ కుర్మా ను ఇండియన్స్ తమదైన స్టైల్లో వండుతున్నారు. మొఘలాయ్ మటన్ కుర్మా టేస్టీ డిష్. దీన్ని రోజంతా ఉపవాస దీక్ష ఉండే వారు హెవీ డిన్నర్ గా తీసుకోవచ్చు. అందుకే దీనికి గ్రేట్ రంజాన్ రిసిపి అని పేరు వచ్చింది.
రంజాన్ వంటకాల్లో చాలా పాపులర్ అయినటువంటి మొఘలాయ్ మటన్ కుర్మాను చాలా తక్కువ మసాలా దినుసులతో తయారు చేస్తారు. ఉపవాసం ఉండేవారికి తప్పనిసరిగా ప్రోటీనులు మరియు శక్తి చాలా అవసరం అవుతుంది. ఇవి రెడ్ మీట్ లో పుష్కలంగా లభిస్తాయి కాబట్టి, రంజాన్ నెలలో దీన్ని ఎక్కువగా వండుతారు. ఈ కుర్మా పులావ్, మొఘలాయ్ బిర్యానీకి ఫర్ ఫెక్ట్ కాంబినేషన్. వండే విధానంలో కూడా చాలా చిన్న తేడా కలిగినది. ఈ మొఘలాయ్ వంటకం చాలా రిచ్ అనిపిస్తుంది. మరీ మీరు టేస్ట్ చేయాంటే ఈ మొఘలాయ్ రిసిపిని ట్రై చేయండి.
కావల్సిన పదార్థాలు:
పాలు మటన్-500gms
ఉల్లిపాయలు: 2 (పేస్ట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పెరుగు: 1/4cup
క్రీమ్: 1/4cup
ఖోయా(కోవా): 2tbsp(తురిమినది)
రబ్ది:1/4cup (1/2 లీటరు పాలను బాగా మరిగించడం వల్ల 1/4 కప్పు అవుతుంది)
జాజికాయపొడి: చిటికెడు
కారం: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3-4నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో మటన్ ముక్కలు వేసి మరో 10నిముసాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత బాగా గిలకొట్టిని పెరుగును పాన్ లో వేగుతున్న మటన్ ముక్కలకు జోడించి , మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే కారం, ఉప్పు, క్రీమ్, కోవా, రబ్ది వేసి మిక్స్ చేస్తూ మరో 5-6నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో అరకప్పు నీల్ళు పోసి, బాగా మిక్స్ చేసి 20-30నిముషాల పాటు మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
7. మటన్ ముక్కలు ఒకసారి ఉడికిన తర్వాత, నట్ మగ్ పౌడర్ మరియు మేస్ పౌడర్ చిలకరించి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి అంతే రాయల్ డెలిషియస్ మటన్ కుర్మా రెడీ



Click it and Unblock the Notifications