Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
ప్రాన్స్ దమ్ బిర్యాని

మారినేషన్ కోసం
రొయ్యలు: 1/2kg
పెరుగు: 1tbsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
గరంమసాలాపొడి: 1tsp
పచ్చిమిర్చి: 2
ఉప్పు,కారం: తగినంత
పసుపు: 1/2tsp
రైస్ కోసం:
బాస్మతి రైస్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాలు
లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా, అనాసపువ్వు, మరాటీమొగ్గ,
జాపత్రి,బిర్యానీ ఆకు
గ్రేవీ కోసం:
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
టమాటా: 1(ప్యూరీ)
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరంమసాలా పొడి: 1tsp
పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నూనె, నెయ్యి, కొంచెం పాలలో నానబెట్టిన శాఫ్రాన్
తయారు చేయు విధానం:
1. మొదటగా మారినేషన్ కోసం పెరుగులో అన్ని పదార్ధాలు కలిపి, శుభ్రం చేసిన రొయ్యలు వేసి ఒక గంట నాననివ్వాలి.
2. తర్వాత బాస్మతి రైస్ కడిగి ఇరవై నిముషాలు నానబెట్టాలి. ఒక పెద్దగిన్నెలో నీళ్ళు మరిగించి, అందులో మసాలాదినుసులు, పుదీనా కొత్తిమీర, కొంచెం ఉప్పు, రైస్ కూడా వేసి ఉడికించాలి.
3. మూడు వంతులు ఉడికాక వడపోసి రెడీ చేసుకోవాలి. ఈలోగా ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేయించాలి.ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటాగుజ్జు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
4. ఇప్పుడు నానబెట్టుకున్నరొయ్యలు వేసి కలిపి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలాపొడి, తరిగిన పొదీనా, కొత్తిమీర వేసి ఉడికించాలి. గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక బిర్యానీకి అరేంజ్ చేసుకోవాలి.
5. ప్రెషర్ కుక్కర్ లో కొంచెం నూనెవేసి సగం రైస్ పరవాలి. దానిమీద రొయ్యల గ్రేవీ సర్ది, పైన మిగిలిన రైస్ వేయాలి. పైన రెండు స్పూన్ల నెయ్యి, తరిగిన పొదీనా, కొత్తిమీర వేసి కొంచెం పాలలో నానబెట్టిన సాఫ్రాన్ వేసుకోవాలి. చిన్నబర్నర్ మీద తావా పెట్టి దానిమీద ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టి వెయిట్ పెట్టాలి.
6. రెండుమూడు నిమిషాల తరువాత సిమ్ లో పెట్టెయ్యాలి. విజిల్స్ రానక్కరలేదు.ఇలా వెయిట్ పెట్టడం వలన స్టీం బయటికి పోదు. ఒక పావుగంటలో బిర్యానీ ఘుమఘుమ వాసన వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఒకసారి జాగ్రత్తగా కలిపి వేడిగా వడ్డిస్తే ప్రాన్ దమ్ బిర్యానీ నోరూరిస్తుంది.



Click it and Unblock the Notifications