Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Telangana Boti Curry: బోటి కూర ఇలా చేస్తే గిన్నె కూడా వదలరు
కూరలందూ బోటి కూర వేరయా స్పైసీగా చేస్తే లొట్టలేసుకు తినాలయ్యా.. కమ్మని బోటి కూర తింటుంటే పాటలు, పద్యాలు తన్నుకూ వస్తాయి. బోటి కూరలో మాధుర్యం మటన్‌లో కూడా దొరకదు. అందుకే చాలా మంది బోటి కూరను చాలా చాలా ఇష్టంగా లాగించేస్తారు
Telangana Boti Curry: కూరలందూ బోటి కూర వేరయా స్పైసీగా చేస్తే లొట్టలేసుకు తినాలయ్యా.. కమ్మని బోటి కూర తింటుంటే పాటలు, పద్యాలు తన్నుకూ వస్తాయి. బోటి కూరలో మాధుర్యం మటన్‌లో కూడా దొరకదు. అందుకే చాలా మంది బోటి కూరను చాలా చాలా ఇష్టంగా లాగించేస్తారు. కారం, ఉప్పు, మసాలా ఎక్కువగా వేసి మంచిగా ఉడకనిచ్చి, కొద్దిగా చల్లారిన తర్వాత బగారా అన్నంలో వేసుకుని తింటే ఆ మజానే వేరు.

దావత్‌ల సమయంలో బోటి కూరను ప్రత్యేకం వండించుకుని తింటే మస్తుంటది. ఇంట్లో ఎన్నిసార్లు వండుకున్నా, ఎన్ని మసాలాలు వేసినా, ఫంక్షన్ల సమయంలో చేసే బోటి కూర మధురంగా ఉంటుంది.
తెలంగాణ స్టైల్‌లో బోటి కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

బోటి కూరకు కావాల్సిన పదార్థాలు:
1. బోటి
2. నూనె
3. ఉల్లిపాయలు
4. పసుపు
5. కారం
6. జీలకర్ర
7. వెల్లుల్లి
8. అల్లం
9. ధనియాలు
10. దాల్చిన చెక్క
11. మరాఠీ మొగ్గ
12. లవంగాలు
13. టమాటా
14. కొత్తిమీర

బోటి కూర తయారీ విధానం:
1. బోటిని ముందుగా ఉప్పు నీటిలో చక్కగా ఉడకనివ్వాలి.
2. ఉడికిన బోటిలో నుండి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. బొంతను చక్కగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. కుక్కర్ తీసుకుని నూనె పోసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి.
5. ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత అందులో ఉడకబెట్టిన బోటి వేసుకోవాలి.
6. బోటి వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. కొంచె ఉప్పు వేసి ఇంకొద్ది సేపు అలా కలుపుకుంటే పచ్చి వాసన పోతుంది.
7. కొద్దిగా ఎక్కునవవ కారం వేసుకోవాలి. బోటి కూర స్పైసీగా ఉంటేనే బాగుంటుంది.
8. సగం ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు అన్నింటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
9. ఈ మసాలా పేస్టును బోటిలో వేసి కలుపుకోవాలి.
10. గ్రేవీ కోసం రెండు మీడియం సైజ్ టమాటాను కట్ చేసి చిన్న ముక్కలు వేసుకోవాలి.
11. చక్కగా కలుపుకుని బోటి పచ్చి వాసన పోయిందనుకున్న తర్వాత పూత పెట్టుకోవాలి.
12. 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి మూత తీసుకోవాలి.
13. బోటి కూర దగ్గరకు వచ్చేంత వరకు కొద్దిసేపు ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర ఆకులు వేసుకుని దింపేసుకోవడమే.
14. కొద్దిగా చల్లారిన తర్వాత బోటి కూరను బగారా అన్నంలో వేసుకుని తింటే భలే మజా ఉంటుంది.



Click it and Unblock the Notifications