For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నుచినుండె రెసిపి ; కర్ణాటక రకం ఘాటైన పప్పు ఉండలు తయారీ ఎలా

కర్ణాటక వారి నుచినుండే సంప్రదాయ వంటకాన్ని పొద్దున ఉపాహారంలో లేదా చిరుతిళ్ళలో తింటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. వీడియోలు, చిత్రాలతో కూడిన తయారీవిధానం చదవండి.

Posted By: Lekhaka
|

కర్ణాటక వారి నుచినుండే సంప్రదాయ వంటకాన్ని పొద్దున ఉపాహారంలో లేదా చిరుతిళ్ళలో తినండి. కన్నడలో 'నుచ్చు' అంటే పప్పు మరియు 'ఉండె' అంటే ఉండలు. అందుకని నుచిన ఉండె అంటే పప్పు ఉండలు.

ఈ కర్ణాటక రకం పప్పు ఉండలను కందిపప్పుతో తయారుచేస్తారు. కొన్నిచోట్ల సెనగపప్పుతో కూడా చేస్తారు. వీటిని కుక్కర్ లేదా ఇడ్లీ పెనంలో ఉడికిస్తారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి, కొవ్వు తక్కువ పదార్థాలు కూడా. అందుకని ఎటువంటి బాధలేకుండా తినేయచ్చు.

ఈ ఉడికిన ఉండలను మజ్జిగపులుసు లేదా మజ్జిగె హులి అనే పెరుగు సంబంధ వంటకాలతో కలిపి తింటారు. ఈ తయారీలో మేము దిల్ ఆకులను వాడాం. అవి తప్పనిసరి కాదు. వాటి బదులు క్యారట్ లేదా కొత్తిమీరను వాడుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని ఇంటివద్దనే సులభంగా చేసుకోవచ్చు. పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి త్వరగా ఈ రుచికర వంటకాన్ని వండుకోవచ్చు. పొద్దున ఆహారానికి ఏదన్నా కొత్తగా ప్రయత్నించడానికి వీడియోలు, చిత్రాలతో కూడిన తయారీవిధానం చదవండి.

నుచినుండె రెసిపి । కర్ణాటక వారి ఘాటైన పప్పు ఉండలు । నుచిన ఉండల రెసిపి । ఉడికించిన పప్పు ఉండలు
నుచినుండె రెసిపి । కర్ణాటక వారి ఘాటైన పప్పు ఉండలు । నుచిన ఉండల రెసిపి । ఉడికించిన పప్పు ఉండలు
Prep Time
6 Hours
Cook Time
45M
Total Time
6 Hours 45 Mins

Recipe By: సుమా జయంత్

Recipe Type: ఉపాహారం

Serves: 20 ఉండలు

Ingredients
  • కందిపప్పు - 1 గిన్నె

    నీరు - ½ లీటరు + 3 కప్పులు

    పచ్చిమిర్చి - 10-20 (కావాల్సిన ఘాటు ప్రకారం)

    అల్లం(చెక్కు తీసినది) - 4 (ఒక అంగుళం ముక్కలు)

    తరిగిన కొబ్బరి -1 కప్పు

    కొబ్బరి ముక్కలు -1/2 కప్పు

    దిల్ ఆకులు -2 కప్పులు

    ఉప్పు రుచికి తగ్గట్టు

    జీలకర్ర - 2 చెంచాలు

    నూనె - జిడ్డుకి తగినంత

How to Prepare
    1. కలిపే పెద్ద గిన్నెలో కందిపప్పు వేయండి.
    2. దాన్ని 3 కప్పుల్లో నీరు 5-6 గంటలు నానబెట్టి , ఎక్కువ నీరును తీసేయండి.
    3. మిక్సి జార్ లో పచ్చిమిరపకాయలను వేయండి.
    4. అల్లం ముక్కలు వేసుకోండి.
    5. నానబెట్టిన కందిపప్పును ఒక గరిటెను వేయండి.
    6. మిక్సీపట్టి పేస్టులా తయారుచేయండి.
    7. పెనంలోకి మార్చండి.
    8. అదే మిక్సీజార్లో మరో గరిటె కందిపప్పు కలపండి.
    9. దాన్ని కూడా మిశ్రమం చేసి పెనంలోకి మార్చుకోండి.
    10. మొత్తం కందిపప్పు మిక్సీ అయ్యేవరకూ ఇదే పద్ధతి పాటించండి.
    11. అయ్యాక, తరిగిన కొబ్బరి తురుమును వేయండి.
    12. కొబ్బరి ముక్కలను వేయండి.
    13. దిల్ ఆకులు, ఉప్పును కలపండి.
    14. బాగా కలపండి.
    15. జీలకర్రను వేసి, బాగా కలిపి, పక్కన పెట్టుకోండి.
    16. అరలీటరు నీరును వేడి ఇడ్లీ పెనంకు జతచేయండి.
    17. ఇడ్లీ ప్లేటును పైన పెట్టండి.
    18. ఇడ్లీ ప్లేటుకు నూనెను రాయండి.
    19. మిశ్రమంలో కొంచెం భాగాలను తీసుకుని , చిన్న బంతుల్లా మీ చేతితో కట్టండి.
    20. ఈ ఉండలను ఇడ్లీ ప్లేటులో వేయండి.
    21. పైన మూతపెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి.
    22. మూత జాగ్రత్తగా తీసి ఉడికిన ఉండలను బయటకి తీయండి.
    23. పళ్ళెంలోకి మార్చి వడ్డించండి.
Instructions
  • 1. దిల్ ఆకులు వేసుకోవడం తప్పనిసరి కాదు.
  • 2. దిల్ ఆకుల బదులు తురిమిన క్యారట్ మరియు కొత్తిమీరను కూడా వాడుకోవచ్చు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 ముక్క
  • క్యాలరీలు - 70 క్యాలరీలు
  • కొవ్వు - 0.9 గ్రాములు
  • ప్రొటీన్ - 1 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 10 గ్రాములు
  • చక్కెర - 1 గ్రాములు
  • ఫైబర్ - 1.6 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - నుచినుండే తయారీ ఎలా

1. కలిపే పెద్ద గిన్నెలో కందిపప్పు 1 బౌల్ వేయండి.

2. దాన్ని నీటితో 5-6 గంటలు నానబెట్టండి , ( 3 కప్పుల నీరును వాడి, ఎక్కువ నీరును తీసేయండి).

3. మిక్సి జార్ లో పచ్చిమిరపకాయలను వేయండి.10-20 (చిన్నవి) (వాటి ఘాటును బట్టి).

4. అల్లం ముక్కలు వేసుకోండి.4 (ఒక అంగుళం ముక్కలు).

5. నానబెట్టిన కందిపప్పును ఒక గరిటెను వేయండి.

6. మిక్సీపట్టి పేస్టులా తయారుచేయండి.

7. పెనంలోకి మార్చండి.

8. అదే మిక్సీజార్లో మరో గరిటె కందిపప్పు కలపండి(1 లేదా 2 గరిటెల కందిపప్పు).

9. దాన్ని కూడా మిశ్రమం చేయండి.

10. (మొత్తం కందిపప్పు మిక్సీ అయ్యేవరకూ) ఇదే పద్ధతి పాటించండి.

11. అయ్యాక, తరిగిన కొబ్బరి తురుమును వేయండి. 1 కప్పు

12. కొబ్బరి ముక్కలను వేయండి. ½ కప్పు (బాగా సన్నగా తరిగినవి)

13. దిల్ ఆకులు కలపండి. 2 కప్పులు

14. ఉప్పు వేయండి.

15. బాగా కలపండి.

16. జీలకర్ర 2 చెంచాలను వేయండి.

17. బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

18. 1/2 లీటరు నీరును వేడి ఇడ్లీ పెనంకు జతచేయండి.

19. ఇడ్లీ ప్లేటును పైన పెట్టండి.

20. ఇడ్లీ ప్లేటుకు నూనెను రాయండి.

21. మిశ్రమంలో కొంచెం భాగాలను తీసుకుని , చిన్న బంతుల్లా మీ చేతితో కట్టండి.

22. ఈ ఉండలను ఇడ్లీ ప్లేటులో వేయండి.

23. పైన మూతపెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి.

24. మూత జాగ్రత్తగా తీసి ఉడికిన ఉండలను బయటకి తీయండి.

25. పళ్ళెంలోకి మార్చి వడ్డించండి.

[ of 5 - Users]
English summary

Nuchinunde Recipe | How To Make Karnataka Style Spicy Dal Dumplings | Nuchina Unde Recipe | Steamed Lentil Dumplings Recipe

Nuchinunde is a healthy breakfast recipe that is popular in Karnataka. Watch the video recipe. Read and follow the step-by-step procedure with images.
Desktop Bottom Promotion