Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. కానీ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో రుచి కోసం ఆరోగ్యాన్ని, లేదా ఆరోగ్యం కోసం రుచిని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చేసుకునే అద్భుతమైన వంటకాలు మనకు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో పనీర్ మెంతి జొన్న రొట్టె ఒకటి. సాధారణంగా మనం రోజూ తినే గోధుమ రొట్టెలకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెసిపీలో పనీర్ వాడటం వల్ల, ఒక్కో రొట్టెలో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ మీల్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసమైనా, మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ కోసమైనా ఇది బెస్ట్ ఆప్షన్.
పనీర్ మెంతి జొన్న రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి - 1 కప్పు
క్యారెట్ తురుము - 1
ఉల్లిపాయ - 1
మెంతికూర - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా
కారం - తగినంత
పసుపు - చిటికెడు
జీలకర్ర పొడి - అర టీస్పూన్
వాము - అర టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
పనీర్ తురుము - 100 గ్రాములు
నీళ్లు - పిండి కలపడానికి సరిపడా
నెయ్యి లేదా నూనె - కాల్చుకోవడానికి సరిపడా
పనీర్ మెంతి జొన్న రొట్టె తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో జొన్న పిండి, తురిమి పెట్టుకున్న పనీర్ వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, మెంతికూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, జీలకర్ర పొడి వేయాలి. అలాగే వామును రెండు చేతులతో నలిపి వేయడం వల్ల రొట్టెకు మంచి సువాసన వస్తుంది. చివరగా నువ్వులు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్దలా మృదువుగా కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక కాటన్ బట్టను గానీ, పాలిథిన్ కవర్ ను గానీ తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసి, పిండి ముద్దను పెట్టి చేతి వేళ్లతో మెల్లగా రొట్టెలా రౌండ్ గా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకుంటే తినడానికి సాఫ్ట్ గా బాగుంటుంది.
-స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయండి. పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి, మనం ఒత్తి పెట్టుకున్న జొన్న రొట్టెను దానిపై వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రెండు వైపులా కొద్దికొద్దిగా నెయ్యి రాస్తూ ఎర్రగా కాల్చుకోవాలి.
-అంతే పనీర్ మెంతి జొన్న రొట్టె రెడీ. జొన్నల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిస్తే, పనీర్ లోని ప్రోటీన్ కండరాలకు బలాన్ని ఇస్తుంది. దీన్ని పెరుగుతో గానీ, ఏదైనా పచ్చడితో లేదా మీకు ఇష్టమైన కర్రీతో గానీ తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
