Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
నూనె పీల్చకుండా కరకరలాడే హోటల్ స్టైల్ ఆలూ బోండా.. పక్కా కొలతలతో ఇలా చేయండి!
సాయంత్రం కాగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగుతూ, కారంగా, కరకరలాడే ఏదైనా స్నాక్ తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అటువంటి సమయంలో మనందరికీ చప్పున గుర్తొచ్చే అద్భుతమైన స్నాక్ ఆలూ బోండా. ఆయిల్ పీల్చకుండా, పైన కరకరలాడుతూ, లోపల నోట్లో వేస్తే కరిగిపోయేలాంటి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ ఆలూ బోండాను పక్కా కొలతలతో సులభంగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఆలూ బోండా తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించి పొట్టుతీసిన బంగాళాదుంపలు - 4
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర తరుగు - కొద్దిగా
పసుపు - అర టీస్పూన్
ఆవాలు, జీలకర్ర- తగినంత
నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టీస్పూన్లు
శనగపిండి - ఒకటిన్నర కప్పు
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
కారం పొడి - 1 టీస్పూన్
వాము - అర టీస్పూన్
వంటసోడా - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఆలూ బోండా తయారీ విధానం
-ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని ఎక్కడా గడ్డలు లేకుండా చేత్తో మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, రెండు స్పూన్ల నూనె వేయండి.
-నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక, మ్యాష్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక చిన్న చిన్న రౌండ్ బాల్స్ (ఉండలు) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, చేతిలో నలిపిన వాము, చిటికెడు వంటసోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని బజ్జీల పిండిలా జారుడుగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా, అలాగని గట్టిగా ఉండకూడదు.
-స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేశాక చేసి పెట్టుకున్న ఒక్కో ఆలూ మసాలా బాల్ ను తీసుకుని, శనగపిండిలో ముంచాలి. పిండి అంతటా పర్ఫెక్ట్ గా కోట్ అయ్యాక జాగ్రత్తగా వేడి నూనెలో వేయాలి. కాస్త కాలిన తర్వాత మీడియం మంటపైనే అటూ ఇటూ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
-అంతే చూస్తుంటేనే నోరూరించే, కరకరలాడే హోటల్ స్టైల్ ఆలూ బోండా మీ ఇంట్లోనే రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
