Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
మండుతున్న ఎండలకు పర్ఫెక్ట్ కిక్.. ఇంట్లోనే చల్లచల్లని స్పైసీ లెమన్ సోడా చేసుకోండిలా!
బయట అడుగుపెడితే చాలు మండుతున్న ఎండలు.. శరీరమంతా చెమటలు, తీవ్రమైన నీరసం. ఇలాంటి సమయంలో గొంతులోకి ఏదైనా చల్లగా, పుల్లపుల్లగా, కొంచెం తీయగా వెళితే ఎంత హాయిగా ఉంటుందో. వేసవిలో శరీరానికి తక్షణమే తాజాదనాన్ని, ఎనర్జీని ఇచ్చే అద్భుతమైన డ్రింక్ నిమ్మ సోడా. దీని తీపి, పులుపు, కొద్దిగా ఘాటైన రుచి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, కడుపులో చాలా చల్లగా అనిపించేలా చేస్తుంది. మార్కెట్లో దొరికే రంగులు, రసాయనాలు కలిపిన కూల్ డ్రింక్స్ కంటే.. మన ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకున్న స్పైసీ లెమన్ సోడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ లెమన్ సోడా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

స్పైసీ లెమన్ సోడా తయారీకి కావలసిన పదార్థాలు
తాజా నిమ్మకాయలు - 2
బాగా చల్లటి క్లబ్ సోడా - 2 గ్లాసులు
చక్కెర లేదా తేనె - 2 నుండి 3 టీస్పూన్లు
నల్ల ఉప్పు(బ్లాక్ సాల్ట్)- అర టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
నల్ల మిరియాల పొడి - చిటికెడు
తాజా పుదీనా ఆకులు - గుప్పెడు
ఐస్ క్యూబ్స్ - తగినన్ని
స్పైసీ లెమన్ సోడా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గ్లాసు తీసుకుని, అందులో తాజా నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. అందులో మీ రుచికి తగినట్లుగా చక్కెర లేదా తేనె వేసి బాగా కరిగేలా స్పూన్ తో కలపాలి.
-ఇప్పుడు గ్లాసులోని నిమ్మరసంలో నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, కాస్త ఘాటు కోసం చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఆ గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేయండి. ప్రెష్ పుదీనా ఆకులను చేతితో కాస్త నలిపి వేయండి. ఇలా చేయడం వల్ల పుదీనా సువాసన పానీయానికి బాగా పడుతుంది.
-ఇప్పుడు ఫ్రిజ్ లోని బాగా చల్లటి సోడాను తీసుకుని నెమ్మదిగా గ్లాసులో పోయాలి. ఎక్కువ నురుగు పైకి పొంగకుండా కాస్త జాగ్రత్తగా పోయాలి. చివరగా గ్లాసు అంచున ఒక నిమ్మకాయ స్లైస్ పెట్టి, పైన లైట్ గా చాట్ మసాలా చల్లండి.
-అంతే బుసబుసమనే చల్లని స్పైసీ లెమన్ సోడా రెడీ.
లెమన్ సోడా ఆరోగ్య ప్రయోజనాలు
-ఇది తాగిన వెంటనే శరీరానికి చలువ చేస్తుంది. అలసట, నీరసం క్షణాల్లో మాయం అవుతాయి.
-వేసవిలో చెమట ద్వారా కోల్పోయిన నీటి శాతాన్ని ఇది తిరిగి అందిస్తుంది.
-ఇందులోని జీలకర్ర, నల్ల ఉప్పు, నిమ్మరసం అజీర్తిని పోగొట్టి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
