Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి
సహజంగానే సాయంత్రం వేడి వేడి టీ తాగుతున్నప్పుడు, దానికి తోడుగా కరకరలాడుతూ ఏదైనా కారంగా, రుచిగా తినాలనిపిస్తుంటుంది. అలాగే పండుగల సమయంలో వరుసగా స్వీట్లు తిని మీ నోరు విసుగు చెందిందా? అయితే మీ నోటికి అద్భుతమైన రుచినిచ్చే బెస్ట్ ఆప్షన్ శనగపిండి మసాలా పల్లీలు.
మన ఇంటికి అకస్మాత్తుగా అతిథులు వచ్చినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు, బయట షాపుల్లో కొనే పనిలేకుండా ఇంట్లోనే చాలా త్వరగా, శుభ్రంగా ఈ రుచికరమైన చిరుతిండిని తయారు చేసుకోవచ్చు. అచ్చం బేకరీలో దొరికే లాంటి రుచితో ఉండే ఈ కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలను మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

శనగపిండి మసాలా పల్లీలు తయారీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - ఒకటిన్నర కప్పులు
శనగపిండి - 1 కప్పు
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి - 5 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
కారం పొడి - పావు టీస్పూన్
ఉప్పు - పావు టీస్పూన్
ఇంగువ - కొద్దిగా
బేకింగ్ సోడా - రెండు చిటికెళ్లు
చాట్ మసాలా - అర టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
శనగపిండి మసాలా పల్లీలు తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని, అందులో ఒక కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ, బేకింగ్ సోడా వేసి ఈ పొడి పదార్థాలన్నీ ఒకదానికొకటి బాగా కలిసేలా స్పూన్ తో కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ పొడి పిండి మిశ్రమంలో పచ్చి వేరుశెనగలను వేసి కలపాలి. మసాలా అంతా పల్లీలకు అంటుకునేలా ఒక టీస్పూన్ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లను చేతితో చిలకరిస్తూ పిండి అంతా పల్లీలకు ఒక కోటింగ్ లా పట్టేలా చూసుకోవాలి. ఇది కాస్త జిగురుగా తయారవుతుంది.
-నీళ్లు చల్లడం వల్ల పల్లీలు ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలా అవుతాయి. వాటిని విడదీయడానికి వాటిపై మరో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పొడి బియ్యప్పిండిని చల్లి చేత్తో విడివిడిగా చేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె మీడియం వేడిలో ఉన్నప్పుడు, మసాలా పట్టిన పల్లీలను నూనెలో వేసి, మంచి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించి పక్కకు తీసుకోండి.
-వేయించిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకుని, అవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వాటిపై కాస్త కారం, అర టీస్పూన్ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు చల్లి గిన్నెను ఎగరేస్తూ బాగా కలపాలి. వేడిగా ఉన్నప్పుడు మసాలా చల్లడం వల్ల అది పల్లీలకు బాగా పట్టుకుంటుంది.
-అంతే నోరూరించే, కరకరలాడే కారం కారం శనగపిండి మసాలా పల్లీలు రెడీ.
-ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, నెల రోజుల పాటు మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
