Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?
నేపాల్..ఈ పేరు వింటేనే అక్కడి ప్రశాంతమైన మంచు కొండలు, నదులు, అందమైన పర్యాటక ప్రదేశాలు, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఆలయాలు గుర్తుకొస్తాయి. అయితే ప్రశాంతంగా ఉండే నేపాల్ ను బుధవారం ఉదయం ఆకస్మిక వరదలు అతలాకుతళం చేశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం వణికిపోయింది. ఎటు చూసినా వరద నీరే.. ఎటు విన్నా ఆర్తనాదాలే.
భోటెకోశీ నదిలో ప్రవాహం సడెన్ గా పెరగడంతో రసువా జిల్లాలో ఊరికి ఊర్లే వరదలో కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ నదులపై నిర్మించిన వంతెనలు కూలిపోయాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 150 మందికిపైనే మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయులతో సహా, 25 దేశాలకు చెందిన సుమారు 403 మంది గల్లంతవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అసలు వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?
వరద అంటే కేవలం నీరు చుట్టుముట్టడం మాత్రమే కాదు. కలుషిత జలాలు, అంటువ్యాధులు, కరెంట్ షాక్ లు, ఆహార కొరత వంటి అనేక ప్రాణాంతక సమస్యలను ఇది వెంట తీసుకొస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలు కొన్ని పక్కా జాగ్రత్తలు పాటించాలి.
ప్రాణరక్షణే తొలి ప్రాధాన్యం
మీ ప్రాంతానికి వరద ముప్పు ఉందని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎత్తైన, సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోండి. వదంతులను నమ్మకండి, ప్రభుత్వ సూచనలు మాత్రమే పాటించండి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించండి.
స్వచ్ఛమైన నీరే శ్రీరామరక్ష
వరదల్లో దాహం తీర్చుకోవడానికి దొరికిన నీటినల్లా తాగేయకండి. కలుషిత నీరు కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని, వడపోసిన నీటిని లేదా సీల్ చేసిన బాటిల్ వాటర్ ను మాత్రమే తాగాలి.
కరెంటుతో ప్రమాదం
వరద నీటిలో విద్యుత్ తీగలు తెగిపడితే ఆ ప్రదేశం దారుణంగా మారుతుంది. నీటిలో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వస్తువులనూ, తెరిచి ఉన్న స్విచ్ బోర్డులనూ తాకవద్దు. మీ ఇంట్లోకి నీరు ప్రవేశిస్తున్నట్లు గమనిస్తే.. తక్షణమే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.

ఆహారం విషయంలో అప్రమత్తత
వరద నీటిలో తడిసిన, పాడైన ఆహారాన్ని పొరపాటున కూడా తినకండి. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. ప్యాక్ చేసిన ఆహారం, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి ముందుగానే నిల్వ చేసుకోవడం బెటర్.
దోమలతో జర భద్రం
వరద తగ్గుముఖం పట్టాక నిలిచిన నీటితో అసలు ముప్పు మొదలవుతుంది. ఆ నీటిలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి దోమతెరలు వాడండి, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించండి.
ఎమర్జెన్సీ కిట్
తరచుగా వరదలు వచ్చే ప్రాంతాల్లో నివసించే వారు ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ కిట్ ను సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో త్రాగునీరు, పొడి ఆహారం, ఫస్ట్ ఎయిడ్ మందులు, టార్చ్ లైట్, అదనపు బ్యాటరీలు, మొబైల్ ఛార్జర్,పవర్ బ్యాంక్, ముఖ్యమైన గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలు ఉండేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
