Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు!
ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వృక్ష సంపదలో అనేక వ్యాధులను నయం చేసే మూలికలు దాగి ఉన్నాయి. మన ఇంట్లో వంట చేస్తున్నప్పుడు లేదా వ్యవసాయ పనులు, ఇతర పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న చిన్న కోతలు, కాలిన గాయాలు అవ్వడం సర్వసాధారణం. ఇలా అయిన వెంటనే మనం హాస్పిటల్ లేదా మెడికల్ షాపుకి పరుగెత్తి ఆయింట్‌మెంట్లు లేదా ట్యాబ్లెట్లు వాడుతాం.
కానీ తరుచుగా మన కళ్లెదుటే కనిపించే ఒక అద్భుతమైన మొక్కతో వీటికి తక్షణమే చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? ఆ అద్భుతమైన ఔషధ మొక్క గడ్డి చామంతి. ఈ మొక్క శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకంబన్స్. దీనిని గాయపాకు లేదా బలపాకు అనే పేర్లతో కూడా పిలుస్తారు. దీన్ని తెలంగాణలో నల్లారం అని కూడా అంటారు.ఇది ఎక్కువగా మన ఇంటి ముందు పెరట్లో లేదా పంట పొలాల్లో గట్లమీద చెరువు గట్టు మీద కనిపిస్తూ ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తరతరాలుగా తమ గాయాలను నయం చేసుకోవడానికి ఈ మొక్కనే అత్యుత్తమ సాంప్రదాయ వైద్యంగా నేటికీ ఉపయోగిస్తున్నారు. మన రైతులకు ఈ మొక్క గురించి బాగా తెలుసు ఎందుకంటే పొలాల్లో విరివిగా కనిపించే ఈ మొక్క వారికి ఒక వైద్యుడిగా పని చేస్తుంది. పొలంలో వారు పని చేసేటప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకు రసాన్ని దెబ్బ తగిలిన చోట పిండి రక్తం గడ్డ కట్టేలా చేసుకునేవారు.
ఎలా ఉపయోగించాలి?
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. దీని వాడకం చాలా సులభం. తాజా గడ్డి చామంతి ఆకులను సేకరించి, ముందుగా వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి, కోసుకున్న లేదా కాలిన గాయాలపై పట్టీలా రాయాలి. ఇలా పూసిన వెంటనే నొప్పి, మంట నుండి క్షణాల్లో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇది వాపును తగ్గించడమే కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది. కేవలం మనుషులకే కాకుండా, మూగ జీవాలకు (పశువులు, జంతువులకు) తగిలే గాయాలను, ఇన్ఫెక్షన్లను మాన్పడంలోనూ ఈ ఆకుల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఇది ఎందుకంత అద్భుతంగా పనిచేస్తుందంటే?
గడ్డి చామంతి మొక్కలో ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్యాటీ యాసిడ్లు, టానిన్లు, ఫైటోస్టెరాల్స్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గాయాలను వేగంగా మాన్పడానికి, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా అడ్డుకోవడానికి అద్భుతంగా సహాయపడతాయి.
అంతేకాకుండా ఇందులో ఉండే ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు శరీరంలో వాపును సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలోని ఎంజైమ్‌లు ఉత్తేజితమై, కణజాలం చాలా వేగంగా కోలుకునేలా చేస్తాయి. కందిన, కాలిన గాయాలకు ఇది అత్యుత్తమ ట్రీటమెంట్ గా చెప్పవచ్చు.
జాగ్రత్తలు తప్పనిసరి
గడ్డి చామంతి మొక్క ఎంతో ప్రయోజనకరమైన అద్భుత ఔషధమే అయినప్పటికీ.. దీనిని ఇష్టానుసారంగా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా తప్పుగా వాడితే చర్మంపై అలెర్జీలు రావడం, తీవ్రమైన దురద, వాంతులు, వికారం వంటి దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఎప్పుడైనా సరే ఈ మూలికను ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
